విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ

పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తున్న సన్యాసినాయుడు, చిన్న

ప్రజాశక్తి-పరవాడ :

మండలంలోని రావాడ గ్రామపంచాయతీ పరిధి ధర్మారాయనపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వం అందించిన పాఠ్యపుస్తకాలను సర్పంచ్‌ మోటూరు సన్యాసి నాయుడు, టిడిపి మండల అధ్యక్షులు వియ్యపు చిన్న మంగళవారం విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్కూలుకు కావలసిన మౌలిక సదుపాయాలన్నీ పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్‌ బాబుతో మాట్లాడి త్వరలోనే ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సారిపెళ్లి జోగినాయుడు, స్కూల్‌ కమిటీ చైర్మన్‌ గొలగాని బాబురావు, మోటూరు హరిబాబు, మోటూరు కాశి, హెచ్‌ఎమ్‌ సన్యాసిరావు, మువ్వల అనకేశ్వరి, దేవి, శ్రీవాణి, శిరీష పాల్గొన్నారు.

➡️