అధైర్య పడొద్దు : అండగా ఉంటా : ఎమ్మెల్యే

ప్రజాశక్తి-యర్రగొండపాలెం వైసిపి నాయకులు, కార్యకర్తలు అధైర్య పడవద్దని, తాను అండగా ఉంటానని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ తెలిపారు. స్థానిక కార్యాలయంలో వైసిపి నాయకులు, కార్యకర్తలతో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టిడిపి ఇచ్చిన హామీలు నెరవేర్చడం కష్టసాధ్యమని పేర్కొన్నారు. నెరవేర్చలేని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని చెప్పారు. ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసా వహిస్తామని చెప్పారు. తాను ఎమ్మెల్యేగా ఐదు మండలాల నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉంటానని తెలిపారు. ఏ చిన్న సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి దొంతా కిరణ్‌ గౌడ్‌, జడ్‌పిటిసి చేదూరి విజయభాస్కర్‌, వైసిపి రాష్ట్ర కార్యదర్శి ఉడుముల శ్రీనివాసరెడ్డి, మండల కన్వీనర్లు కొప్పర్తి ఓబుల్‌రెడ్డి, సింగారెడ్డి పోలిరెడ్డి, గంటా వెంకట రమణారెడ్డి, సర్పంచులు రామావత్‌ అరుణాబాయి, దుగ్గెంపూడి సుబ్బారెడ్డి, జడ్‌పి కో ఆప్షన్‌ సభ్యుడు జయ్యద్‌ షాబీర్‌ బాషా, నాయకులు రాములు నాయక్‌, మోర్తాల సుబ్బారెడ్డి, సింగా ప్రసాద్‌, గురిజేపల్లి వలి, సూరె రమేష్‌ పాల్గొన్నారు.

➡️