ఉపాధి కూలీల బకాయిలు వెంటనే చెల్లించాలి : సిపిఎం

Jun 28,2024 15:32 #Arrears, #cpm, #Employment, #immediately

నక్కపల్లి (విశాఖ) : నక్కపల్లి మండలములో 7 వారాలుగా పెండింగ్‌ లో ఉన్న ఉపాధి కూలీలు బకాయిలు చెల్లించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.అప్పలరాజు డిమాండ్‌ చేశారు. శుక్రవారం నక్కపల్లిలోని సిఐటియు కార్యాలయంలో పార్టీ మండల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశం లో ఉపాధి కూలీల సమస్య పై చర్చంచడం జరిగింది. ఉపాధి హామీ చట్టం ప్రకారం రావాల్సిన సమ్మర్‌ అలవెన్స్‌, ప్లే సిప్‌ లు, మెడికిల్‌ కిట్స్‌, ఇవ్వాలని అదే విధముగా జాబ్‌ కార్డుకు 200 రోజులు పని కల్పించి రోజుకు 600 రూపాయలు కూలి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వెంటనే 7 వారాలుగా పెండింగ్‌ లో బకాయిలు చెల్లించకపోతే పోరాటం ఉధఅతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఎం. రాజేష్‌, మండల కమిటీ సభ్యులు గొర్ల రమణ, నాయకులు పీక్కి శ్రీను, ఏడిద నవీన్‌, ఎమ్‌. శ్రీను, గొర్ల రాము, పల్లా శివ, రాజు తదితరులు పాల్గొన్నారు.

➡️