పదో తరగతి పరీక్షల ముగింపు

Mar 27,2024 22:46
పదో తరగతి పరీక్షల ముగింపు

ప్రజాశక్తి-యంత్రాంగం తాళ్లపూడి మండలంలో 81 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరు అయ్యారని ఎంఇఒలు బాలామణి, నెహ్రూజీ తెలిపారు. నాలుగు పరీక్ష కేంద్రాల్లో 734 మంది విద్యార్థులు పరీక్షలు రాయడానికి ఏర్పాట్లు చేయగా 653 మంది విద్యార్థులు పరీక్షలు రాశారని తెలిపారు. చాగల్లు మండలంలో మూడు సెంటర్లలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు 443 విద్యార్థులు మంది హాజరు కావాల్సి ఉండగా 390 మంది విద్యార్థులు హాజరైనట్లు ఎంఇఒలు వి.ఖాదర్‌ బాబు, సిహెచ్‌.సుధాకర్‌ తెలిపారు. చాగల్లు జెడ్‌పి హైస్కూల్‌ సెంటర్‌కు ఫ్లయింగ్‌ స్వాడ్‌ వచ్చిన తనిఖీ చేసినట్టు ఎంఇఒ ఖాదర్‌ బాబు తెలిపారు. దేవరపల్లి పదో తరగతి పరీక్షలు ముగిశాయని, గురువారం హెచ్‌ అండ్‌ ఎఫ్‌టి పరీక్షలు, శనివారం ఒకేషనల్‌ పరీక్షలు ఉంటాయని ఎంఇఒలు మాణిక్యం తిరుమల దాసు, కెఆర్‌ఎస్‌వివి.అప్పారావు తెలిపారు. గోపాలపురం మండలంలో 10 పరీక్షలు ముగిశాయని ఎంఇఒలు జి.శ్రీనివాసరావు, మహేశ్వరరావు తెలిపారు. మండలంలో ఐదు పరీక్ష కేంద్రాల్లో చివరి రోజు సోషల్‌ పరీక్షకు రెగ్యులర్‌, ప్రైవేట్‌ కలిసి 1,008 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్ష రాయవలసి ఉండగా 864 పరీక్ష రాసినట్లు తెలిపారు. 144 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరైనట్లు తెలిపారు.

➡️