పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయించండి

Mar 1,2024 13:03 #East Godavari
Give children pulse polio drops

ప్రజాశక్తి-గోకవరం : గోకవరం మండలంలోని పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని వైసీపీ నాయకులు పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రమైన గోకవరం గ్రామపంచాయతీ కార్యాలయము నందు ఈ సందర్భంగా పలువురు వైసీపీ నాయకులు విలేకరులతో మాట్లాడుతూ గోకవరం మండలంలో 41 బూతులలో 0 సున్నా నుండి 5 సం. వయసుగల 6412 మంది పిల్లలకు 174 మంది వైద్య సిబ్బంది పోలియో చుక్కలు వేస్తారన్నారు. ఈనెల 3వ తేదీన జరిగే పల్స్ పోలియో కార్యక్రమానికి తల్లులందరూ పాల్గొని తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని , పల్స్ పోలియో పోస్టర్లను వైసీపీ నాయకులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్ పర్సన్ దాసరి చిన్నబాబు, వైసీపీ నాయకులు సుంకర వీరబాబు, వరసాల ప్రసాద్, టి శివాజీ, పులపర్తి బుజ్జి,ఈఓపి ఆర్డ్ రాజేశ్వరరావు, పంచాయతీ సెక్రెటరీ టంకాల శ్రీనివాసరావు వైద్య సిబ్బంది మూర్తి, శంకర్ పవన్, రమణ పాల్గొన్నారు.

➡️