NAFCUB సొసైటీ ఎన్నికల్లో ఓటేసిన జెసి తేజ్ భరత్

Feb 12,2024 16:46 #East Godavari
JC Tej Bharat who voted in the NAFCUB society elections

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్ : పట్టణ సహకార బ్యాంకుల – నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అండ్ క్రెడిట్ సొసైటీస్ (NAFCUB) యొక్క అపెక్స్ బాడీ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించు కోవడం జరిగిందనీ జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు ది ఆర్యాపురం కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఛైర్మన్ ఎన్.తేజ్ భరత్ తెలిపారు. ఈ సంధర్భంగా జేసీ ఎన్. తేజ్ భరత్ వివరాలు తెలియ చేస్తూ, దేశవ్యాప్తంగా NAFCUB లో అపెక్స్ బాడీ లో 386 పట్టణ కో ఆపరేటివ్ బ్యాంకులు సభ్యత్వం కలిగి ఉన్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 46 బ్యాంకుల ప్రతినిధులు హాజరైనట్లు జెసి తేజ్ భరత్ వెల్లడించారు. ఈ అపెక్స్ బాడీ సమావేశంలో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకున్నట్లు ఆయన తెలియ చేశారు. గ్రామీణ సహకార బ్యాంకులు డైరెక్టర్ల పోస్టులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారనీ, పట్టణ సహకార బ్యాంకులు డైరెక్టర్ల పోస్టులు భర్తీ కోసం జరిగిన ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తేజ్ భరత్ తెలియ జేశారు.

➡️