గెడ్డంశివను పరామర్శించిన ఎమ్మెల్యే గోరంట్ల

Mar 20,2024 13:56 #East Godavari

ప్రజాశక్తి-కడియం : ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్, చిరు సేవాసమితి అధ్యక్షులు గెడ్డం శివను రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పరామర్శించారు. ఆసుపత్రిలో శస్త్రచికిత్స అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న శివను బుధవారం స్థానిక టిడిపి నాయకులు వెలుగుబంటి నాని, మార్గాని సత్యనారాయణ తోకలసి శివ ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు.

➡️