చేనేతల సమస్యల పరిష్కారానికి కృషి

ప్రజాశక్తి-చీరాల: చేనేతల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని టిడిపి చీరాల నియోజక వర్గ అభ్యర్థి ఎంఎం. కొండయ్య తెలిపారు. మండల పరిధిలోని దేవాంగపురిలో టిడిపి గ్రామ అధ్యక్షులు పృథ్వీ లలిత మోహన్‌, వస్త్ర వ్యాపారవేత్త సిద్ధి బుచ్చేశ్వరరావు ఆధ్వ ర్యంలో చేనేతల ఆత్మీయ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కొండయ్య మాట్లాడుతూ చీరాల నియోజకవర్గంలో చేనేతలు అధికంగా ఉన్నారని తెలిపారు. వారి సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. తనకు ఒక్క అవకాశమిస్తే టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. ఆప్కో ద్వారా చేనేత వస్త్రాల కొనుగోలు, ప్రభుత్వ సంస్థల్లో చేనేత వస్త్రాల వినియోగం, నూలు, పట్టు,సబ్సిడీపై జరీ రంగులు రసాయనాలు అందేలా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి యువ నాయకుడు మహేంద్రనాథ్‌, సబ్జా రేణుక, పృథ్వీ వెంకటేశ్వర్లు, జొన్న చిన్న రాజు, రాజా, జొన్న శేషలక్ష్మి, కర్ణ, గిరీష్‌, నిఖిల్‌ తదితరులు పాల్గొన్నారు.టిడిపిలో చేరిక..వేటపాలెం గ్రామానికి పొగడదండ వెంక టేశ్వర్లు, ఆయన కుమారులు సుబ్బారావు, నరసింహ ఆధ్వర్యంలో 80 కుటుంబాల వారు టిడిపిలో చేరారు. అదేవిధంగా బోయినవారిపాలెం చెందిన పలువురు యువకులు ఎంఎం. కొండయ్య సమక్షంలో టిడిపిలో చేరారు.

➡️