వాకర్స్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గం ఎన్నిక

Mudasarlova Walkers association elections

ప్రజాశక్తి – ఆరిలోవ : ముడసర్లోవ వాకర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శి ఎన్నికలు ఆదివారం ఆరిలోవ కాలనీ స్కిల్‌డెవలెప్‌మెంట్‌ సెంటర్‌ సమీపంలోని ముడసర్లోవ వాకర్స్‌ అసోసియేషన్‌ కార్యాలయంలో ప్రశాంతంగా జరిగాయి. ఎన్నికల పరిశీలకులుగా అల్లంపల్లి రాజబాబు, కొరికాన మోహనరావు, పి.వెంకటేశ్వరరావు వ్యవహరించారు. ఈ ఎన్నికలో మొత్తం 126 మంది సభ్యులకు 117 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధ్యక్షునిగా పల్ల శ్రీనివాసరావు తన ప్రత్యర్థి వివిఎస్‌.మూర్తిపై 30 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు. చిట్టూరి సత్యనారాయణ 20 ఓట్ల మెజార్టీతో కోశాధికారిగా గెలుపొందారు. ప్రధాన కార్యదర్శిగా నాగులపల్లి రవికుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గౌరవాధ్యక్షులుగా కొరకాన మోహనరావు, సి.సాయికుమార్‌, ముఖ్య సలహాదారునిగా అల్లంపల్లి రాజబాబు, సలహాదారునిగా గూడపాటి విక్టర్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు పల్ల శ్రీనివాసరావు, నాగులపల్లి రవికుమార్‌ మాట్లాడుతూ వాకర్స్‌ క్లబ్‌ సంక్షేమానికి తమ వంతు కృషిచేస్తామని హామీ ఇచ్చారు.

➡️