ఎన్నికలు సజావుగా సాగేందుకు భద్రత ఏర్పాట్లు పూర్తి

Mar 28,2024 22:11

ఎస్‌పి మేరీ ప్రశాంతి
ప్రజాశక్తి – ఏలూరు స్పోర్ట్స్‌
ఎన్నికలు సజావుగా సాగేందుకు పూర్తిస్థాయి భద్రత ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశామని ఎస్‌పి మేరీప్రశాంతి తెలిపారు. ఓట్ల లెక్కింపునకు సిద్ధపరచిన సిఆర్‌.రెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాల భద్రత వాటి మౌలిక సదుపాయాలపై ఎస్‌పి ప్రత్యేకంగా గురువారం మానిటరింగ్‌ చేశారు. ఏలూరులో ఎన్నికలు నిర్వహించిన అనంతరం ఇవిఎంలను భద్రపరిచేందుకు నగరంలోని వట్లూరు ప్రాంతంలో ఉన్న సర్‌ సిఆర్‌.రెడ్డి కళాశాలను ఎంపిక చేశారు. అయితే సిఆర్‌.రెడ్డి కళాశాల భద్రత వాటి మౌలిక సదుపాయాలపై మానిటరింగ్‌ చేసేందుకు ఎస్‌పి మేరీప్రశాంతి గురువారం కళాశాలకు చేరుకుని పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎప్పటికప్పుడు సిఆర్‌.రెడ్డి కళాశాల వద్ద బందోబస్తు ఏర్పాట్లను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని మూడో పట్టణ పోలీసులకు సూచించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్‌ బ్రాంచ్‌ సిఐ మల్లేశ్వరరావు, త్రీ టౌన్‌ సిఐ వెంకటేశ్వరరావు, ట్రాఫిక్‌ సిఐ శ్రీనివాసరావు, వన్‌టౌన్‌ ఎస్‌ఐ లక్ష్మణ్‌బాబు పాల్గొన్నారు.

➡️