గూటాల జెడ్‌పిహెచ్‌లో విద్యా, విజ్ఞాన ప్రదర్శన

Feb 3,2024 22:11

ప్రజాశక్తి – పోలవరం

మండలంలోని గూటాల గ్రామం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో శనివారం 9వ తరగతి విద్యార్థులచే ఇంగ్లీష్‌ అకాడమిక్‌ పెర్ఫార్మెన్స్‌ ప్రదర్శన నిర్వహించారు. పిల్లలు ఇప్పటిదాకా నేర్చుకున్న పాఠ్యపుస్తకాల అంశాలను వివిధ ప్రక్రియలు, సంభాషణలు, ఉపన్యాసాలు, కథలు, రోల్‌ ప్లేలు ప్రదర్శించి పలువురి ప్రశంసలు అందుకున్నారు. పిల్లలు ఏవైనా నేర్చుకున్నారంటే కేవలం పరీక్షలు రాయడం ఒకటే ప్రమాణం కాదు, వాళ్లు నేర్చుకున్న వాటిని ప్రదర్శించాలి అని. దీని ద్వారా పిల్లలకు భయం పోవడమే కాకుండా తాము చెప్పగలం అనే ఆత్మవిశ్వాసం వస్తుంది. ఈరోజుల్లో కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఎంత అవసరమో మన అందరికీ తెలుసు. ఆంగ్ల ఉపాధ్యాయిని వంగీపురం స్వర్ణలత మాట్లాడుతూ పాఠశాలల్లో జరిగే ఇటువంటి కార్యక్రమాలు పిల్లల్లో ప్రదర్శనా నైపుణ్యాలను పెంచుతుందన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కెవి.రాఘవన్‌ మాట్లాడుతూ ఇలాంటి ప్రదర్శనలు ప్రతి సబ్జెక్ట్‌లోనూ చేయవచ్చని, అది పిల్లల జ్ఞానాభివృద్ధికి తోడ్పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, పేరెంట్‌ కమిటీ మెంబర్లు, ఉపాధ్యాయులు పిల్లల్ని అభినందించారు.

➡️