ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ప్రజాశక్తి – బుట్టాయగూడెం
మండలంలోని బుట్టాయగూడెం రైతు భరోసా కేంద్రం ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంఎల్‌ఎ తెల్లం బాలరాజు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చి ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుందని, ఈ అవకాశాన్ని అన్ని రైతు భరోసా కేంద్ర పరిధిలోని రైతులు వినియోగించుకోవాలని కోరారు.

➡️