పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం

బుట్టాయగూడెం: మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎంఎల్‌ఎ తెల్లం బాలరాజు, పోలవరం నియోజవర్గ సమన్వయకర్త తెల్లం రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. పులిరాముడుగూడెం సచివాలయం పరిధిలో రూ.25 లక్షల వ్యయంతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని, రూ.40 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను, కోట రామచంద్రాపురం సచివాలయ పరిధిలో రూ.15.50 లక్షలతో నిర్మించిన హెల్త్‌ క్లినిక్‌ను, సీసీ రోడ్లను, బుట్టాయిగూడెం-2 సచివాలయ పరిధిలోని కంసాలకుంటలో సీసీ రోడ్లును, దొర మామిడి గ్రామ సచివాలయం పరిధిలో రూ.42 లక్షలతో నిర్మించిన సచివాలయంను, రూ.25 లక్షల వ్యయంతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ఎంఎల్‌ఎ శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపిపి గుగ్గులోతు మోహన్‌ రావు, మండల కన్వీనర్‌ అల్లూరి రత్నాజీ, ఎస్‌టి సెల్‌ అధ్యక్షులు కొవ్వాసి నారాయణ పాల్గొన్నారు.

➡️