పలు అభివృద్ధి పనులు ప్రారంభం

కూలి రేట్లు పెంచాలని హమాలీల నిరసన

పోలవరం :మత్స్య శాఖలో పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంఎల్‌ఎ తెల్లం బాలరాజు అన్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన 2021-22 పథకంలో భాగంగా 40 శాతం సబ్సిడీతో రూ.23 లక్షలు విలువ చేసే నాలుగు చక్రాల చేపలు రవాణా వాహనాన్ని ఎంఎల్‌ఎ శుక్రవారం పట్టిసీమ గ్రామానికి చెందిన కామిశెట్టి నాగరాజుకు అందజేశారు. మండలంలోని పలు గ్రామాలలో నూతన భవనాల ప్రారంభోత్సవాల కార్యక్రమంలో ఎంఎల్‌ఎ, నియోజకవర్గ సమన్వయకర్త తెల్లం రాజ్యలక్ష్మి, ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్‌ కుమార్‌ పాల్గొన్నారు. మండలంలో పలుగ్రామాలైన కొండ్రుకోట గ్రామంలో నూతన సచివాలయ భవనం, హెల్త్‌ క్లినిక్‌, రైతు భరోసా కేంద్రం, షాపింగ్‌ కాంప్లెక్స్‌, గ్రామ సచివాలయం, వైఎస్‌ఆర్‌ విలేజ్‌ క్లినిక్‌లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి సుంకర వెంకట్‌ రెడ్డి, తహశీల్దార్‌ ప్రసాద్‌, ఎంపిడిఒ జి.శ్రీను పాల్గొన్నారు. ముదినేపల్లి : ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా మండలంలోని శ్రీహరిపురం, సింగరాయపాలెం గ్రామాల సచివాలయాల పరిధిలో పలు అభివృద్ధి పనులకు శుక్రవారం ఎంఎల్‌ఎ దూలం నాగేశ్వరరావు ప్రారంభోత్సవాలు చేశారు. మండలంలోని చేవూరుగూడెంలో రూ.10 లక్షలతో నిర్మించిన సీసీ డ్రెయిన్లను ప్రారంభించారు. అనంతరం కాకరవాడ శివారు దేవరం, సింగరాయపాలెం, శ్రీహరిపురం గ్రామాల్లో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లను ప్రారంభించారు. పార్టీ శ్రేణులు భారీ బైక్‌ ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

➡️