భవన నిర్మాణ కార్మికునికి ‘మానవత’ సాయం

ప్రజాశక్తి – భీమడోలు

స్వచ్ఛంద సంస్థ భీమడోలు మానవత శాఖ రానున్న కాలంలో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను చేపట్టనుందని సంస్థ అధ్యక్షులు వట్టి సుగుణాకర్‌ తెలిపారు. సేవా కార్యక్రమంలో భాగంగా మానవత శుక్రవారం మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన నలుగురు నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు, దుస్తులు పంపిణీ చేశారు. ఇదేక్రమంలో భాగంగా భవన నిర్మాణ కార్మికునిగా పనిచేస్తూ ప్రమాదవశాస్తూ తీవ్రంగా గాయపడి రెండు కాళ్లు విరిగిన శ్రీనివాస్‌కు చికిత్స కోసం మానవతా రూ.5 వేల నగదు, శాఖ అధ్యక్షులు వట్టి సుగుణాకర్‌, పంచకర్ల సత్యనారాయణ మరొక ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆయన కుటుంబానికి నిత్యావసర వస్తువులను సమకూర్చారు. ఈ కార్యక్రమంలో శాఖ ఛైర్‌పర్సన్‌ జి.నూకరాజు పాల్గొన్నారు.

➡️