‘యువతే జనసేనకి వెన్నుముక’

ప్రజాశక్తి – ఉంగుటూరు

అన్ని పార్టీల కంటే యువత జనసేనలోనే ఎక్కువుగా వున్నారని ఉంగుటూరు జనసేన ఇన్‌ఛార్జి పత్సమట్ల ధర్మరాజు పేర్కొన్నారు. ఆదివారం నారాయణపురం జనసేన కార్యాలయంలో ఆదివారం నియోజకవర్గ సమావేశం జరిగింది. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో వారికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సమావేశంలో ధర్మరాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సోషల్‌ మీడియా ద్వారా పవన్‌ కళ్యాణ్‌ సేవలను, పార్టీ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెవెళ్లాలని అన్నారు. సోషల్‌ మీడియా ద్వారా మెరుగైన సమాచారాన్ని తీసుకెళ్లాలని, పార్టీ సింబల్‌ గాజు గ్లాస్‌ గుర్తును ప్రజలకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు నియోజకవర్గం ఐటి వింగ్‌ కోఆర్డినేటర్‌ అయితం ప్రసాద్‌, గ్రామ స్థాయి కోఆర్డినేటర్లు జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.

➡️