యోగాసన పోటీలకు తోటపల్లి హీల్‌ విద్యార్థుల ఎంపిక

ప్రజాశక్తి – ఆగిరిపల్లి

జాతీయస్థాయి యోగాసన ఛాంపియన్‌షిప్‌ పోటీలకు మండల పరిధిలోని తోటపల్లి హీల్‌ ప్యారడైజ్‌కు చెందిన ఆర్‌. కవిత (6వతరగతి), వి.కా క్షాయని(4వతరగతి)లు ఎంప ికైనట్లు ప్రిన్సిపల్‌ బి.సాయిబాబు తెలిపారు. ఈనెల 9 నుంచి 11 వరకు నాగార్జున యూనివర్శిటిలో నిర్వహించిన 4వ రాష్ట్రస్థాయి యోగాసన అర్హత పోటీల్లో ఈ ఇద్దరు బాలికలు సుబ్జుస్‌ రిథమిక్‌ ఫెయిర్‌ సిల్వర్‌ మెడల్స్‌ సాధించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన అభినందన సభలో హీల్‌ వ్యవస్థాపక అధ్యక్షులు కోనేరు సత్యప్రసాద్‌, క్యాంపస్‌ ఛైర్మన్‌ పిన్నమనేని ధనప్రకాశ్‌, సిఇఒ కూరపాటి అజరుకుమార్‌, పిఇటిలు నాగరాజు, ప్రభుదాసులు, ఉపాధ్యాయులు, బాలికలను అభినందించారు.

➡️