రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో విద్యార్థుల రక్తదానం

ఏలూరు అర్బన్‌ : భారతరత్న డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ 125 అడుగుల సామాజిక న్యాయ మహాశిల్పం ఆవిష్కరణ సందర్భంగా సామాజిక సమతా సంకల్ప కార్యక్రమాల్లో భాగంగా ఏలూరు సర్వజన ఆస్పత్రి ప్రాంగణంలో ఉన్న రెడ్‌క్రాస్‌ భవనంలో గురువారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో 60 మంది ఉద్యోగులు, విద్యార్థులు రక్తదానం చేశారని జిల్లా రెడ్‌క్రాస్‌ ఛైర్మన్‌ బివి.కృష్ణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇన్‌ఛార్జి డిఎంహెచ్‌ఒ నాగేశ్వరరావు, డిపిఒ టి.శ్రీనివాస్‌ విశ్వనాథ్‌, డ్వామా పీడీ ఎ.రాము, ఎపిఎస్‌ఆర్‌టిసి డిప్యూటీ సిటిఎం వరప్రసాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని, ఈ రక్తదాన శిబిరంలో పెద్ద ఎత్తున పాల్గొన్న వైద్య శాఖ, ఆర్‌టిసి, పంచాయతీరాజ్‌ శాఖ, డ్వామా, రామచంద్ర ఇంజనీరింగ్‌, పిజి కళాశాల విద్యార్థులకు, ఏలూరు కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థులందరికీ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ కార్యదర్శి కెబి సీతారాం, మెడికల్‌ ఆఫీసర్‌ ఆర్‌ఎస్‌ఆర్‌ కె.వరప్రసాదరావు, పాల్గొన్నారు.

➡️