లాండ్‌ టైటిల్‌ యాక్ట్‌ సవరణపై నిరసన

జంగారెడ్డిగూడెం : ఆంధ్రప్రదేశ్‌ లాండ్‌ టైటిల్‌ యాక్ట్‌ను నిరసిస్తూ జంగారెడ్డిగూడెం బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మంగళవారం స్థానిక బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులు నినాదాలు చేస్తూ కోర్టు నుంచి బస్‌ స్టాండ్‌ వరకూ ర్యాలీ నిర్వహించారు. అలాగే బస్‌ స్టాండ్‌ దగ్గర డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బార్‌ అసోసిసేషన్‌ అధ్యక్షులు అచ్యుత శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లాండ్‌ టైటిల్‌ యాక్ట్‌ వల్ల అనేక భూవివాదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అందువల్ల ఈ చట్టాన్ని వెంటనే రద్దు చెయ్యాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఎవివి.భువనేశ్వరి, తల్లాడి అశోక్‌ కుమార్‌, ప్రతాప్‌, మేకా ఈశ్వరయ్య పాల్గొన్నారు

➡️