విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి

Feb 11,2024 17:52

స్పోర్ట్స్‌మీట్‌ ప్రారంభంలో డాక్టర్‌ వెంకటప్రసాద్‌
ప్రజాశక్తి – ఏలూరు సిటీ
విద్యతో పాటు ఆటలపై కూడా విద్యార్థులు మక్కువ చూపాలని ఆంధ్ర హాస్పిటల్స్‌ వైద్యులు ఎం.వెంకటప్రసాద్‌ సూచించారు. స్థానిక వినాయక నగర్‌లోని భాష్యం ఇంగ్లీష్‌ మీడియం స్కూలులో స్పోర్ట్స్‌ మీట్‌ను శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ వెంకటప్రసాద్‌ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యతను వెలికి తీసేందుకు స్పోర్ట్స్‌ మీట్‌ నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు. ప్రతి విద్యార్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గెలుపు, ఓటములు ప్రామాణికమని చెప్పారు. విద్యార్థులు స్నేహపూరిత వాతావరణంలో ఈ స్పోర్ట్స్‌మీట్‌లో పాల్గొనాలన్నారు. స్పోర్ట్స్‌మీట్‌లో ఏలూరు బ్రాంచెస్‌ రెండు, తణుకు ఒకటి, తాడేపల్లిగూడెం ఒకటి, కైకలూరు ఒకటి మొత్తం ఐదు బ్రాంచులకు సంబంధించిన విద్యార్థులకు 65 మీటర్ల రన్నింగ్‌ రేస్‌, జిగ్‌ జాగ్‌ ర్యాలి, బాల్‌ త్రో వంటి పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను డాక్టర్‌ వెంకటప్రసాద్‌ చేతులమీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో స్కూల్‌ ప్రిన్సిపల్‌ జి.కోటేశ్వరరావు, వెస్ట్‌ జోన్‌ జెడ్‌సిఒ విశాలాక్షి, జెడ్‌ఇఒ ఎ.శ్రీమన్నారాయణరెడ్డి , ఛాంప్స్‌ హెచ్‌ఎం సంధ్యారాణి పాల్గొన్నారు.

➡️