సమతావాది జగ్జీవన్ రామ్

Apr 5,2024 15:14 #Eluru district

ప్రజాశక్తి-కలెక్టరేట్(ఏలూరు) : బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డా.బాబు జగ్జీవన్ రామ్ సమతవాది, సంస్కరణవాది అని జిల్లా జాయింట్ కలెక్టర్ బి.లావణ్య వేణి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 116వ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమం జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ జయ ప్రకాష్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ బి లావణ్య వేణి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులు డా.జగ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలు ఎప్పటికీ మరువలేమని అన్నారు.  ఆధునిక భారత నిర్మాణంలో బాబు జగ్జీవనరామ్ ఒకరిని అన్నారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమని నమ్మి ప్రతి పేదవాడు విద్యావంతుడు కావాలని ప్రజల్లో చైతన్యం తీసుకు వచ్చిన మహా మనిషి అన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ విద్య అభ్యసించి ఉన్నత స్థానాలు పొందాలని, ఆయన చేసిన సేవలు మరువ రాదని తెలిపారు. తొలుత జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్య వేణి, జిల్లా రెవెన్యూ అధికారిణి డి .పుష్ప మణి, జిల్లా సోషల్ వెల్ఫేర్ జెడి జయప్రకాష్, జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలను వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో డిపిఓ తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్, డిఆర్డిఏ పిడి డాక్టర్ ఆర్. విజయ రాజు, జిల్లా మైనార్టీస్ అధికారి ఎన్ఎస్ కృపావరం, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎన్. పుష్పలత, బీసీ సంక్షేమ శాఖ అధికారిన ఆర్ నాగరాణి, విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులు రాకాడ మణి, విద్యార్థులు వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

➡️