‘పోలవరం’ను సందర్శించిన ట్రెయినీ ఐఎఎస్‌లు

ప్రజాశక్తి – పోలవరం
పోలవరం ప్రాజెక్టును ట్రెయినీ ఐఎఎస్‌ల బృందం శనివారం పరిశీలించింది. ఆంధ్రప్రదేశ్‌ 2023-24 సంవత్సరం బ్యాచ్‌ ట్రెయినీ ఐఎఎస్‌లు ఆరుగురు పోలవరం ప్రాజెక్టుకు చేరుకుని స్పిల్‌వే, హిల్‌ వ్యూ, ఎగువ, దిగువ కాపర్‌ డ్యామ్‌లు, పవర్‌ ప్రాజెక్టు ప్రాంతాలను పరిశీలించారు. వారికి ఇంజనీరింగ్‌ అధికారులు సంబంధిత వివరాలను తెలిపారు. ఈ బృందంలో ట్రెయినీ కలెక్టర్లు సిహెచ్‌.కళ్యాణి, దామెర హిమవంశీ, పవార్‌ స్వప్నిల్‌ జగన్నాధ్‌, బొల్లిపల్లి వినూత్న, హెచ్‌ఎస్‌.భావన, సుభమ్‌ నోక్వాల్‌ ఉన్నారు. వారి వెంట పోలవరం తహాశీల్దార్‌ జివి.ప్రసాద్‌, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. ఏలూరు: జిల్లా పర్యటనలో భాగంగా శనివారం ఏలూరు చేరుకున్న ఎపి ట్రెయినీ ఐఎఎస్‌లు జిల్లా కలెక్టర్‌ కె.వెట్రి సెల్విని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. 2023 ఎపి బ్యాచ్‌కు చెందిన ఆరుగురు ట్రెయినీ ఐఎఎస్‌ల బృందంలో సిహెచ్‌.కళ్యాణి (కర్నూలు), దామెర హిమవంశీ (చిత్తూరు), పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ (గుంటూరు), బొల్లిపల్లి వినూత్న(అనంతపురం), హెచ్‌ఎస్‌.భావన(కాకినాడ), శుభమ్‌ నోఖ్వాల్‌ (ఎన్‌టిఆర్‌ జిల్లా) ఉన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ వెట్రి సెల్వి మాట్లాడుతూ మంచి పాలన అందించి ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేయాలన్నారు. మంచి పాలనాదక్షులుగా ఎదగాలని ఆమె ఆకాంక్షించారు.

➡️