విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

Nov 23,2023 15:25 #ntr district

ప్రజాశక్తి – రెడ్డిగూడెం(ఎన్టీఆర్-జిల్లా) : ఈ నెల 26 వ తేదీన ‘భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని’ పురస్కరించుకుని గురువారం నాడు కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ నెహ్రూ యువకేంద్రం ఎన్టీఆర్ జిల్లా మరియు రెడ్డిగూడెం ఎన్జీవో “ఫ్రెండ్ సర్వీస్ సొసైటీ”స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలొ విద్యార్థులకు ‘భారత రాజ్యాంగ రచన – దాని ఆవశ్యకత ‘అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో 117 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫ్రెండ్స్ సర్వీస్ సొసైటీ అధ్యక్షుడు చాట్ల విజయ్ కుమార్ మాట్లాడుతూ రాజ్యాంగం రచన – దాని ఆవశ్యకత గురించి విద్యార్థులు తెలుసుకోవడం కోసం ఈ పోటీలు నిర్వహించడం జరిగిందనీ విద్యార్థులు ఇంత పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయమన్నారు. గెలుపొందిన వారికి ఈ నెల 26 వ తేదీన జరిగే రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా బహుమతుల ప్రధానం చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ సర్వీస్ సొసైటీ గౌరవ సలహాదారుడు ప్రత్తిపాటి పాల్ఇమ్మానుయేలు, డైరెక్టర్ చాట్ల హన్న, గురుకుల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తబిత, ఉపాధ్యాయులు ఛైతన్య తదితరులు పాల్గొన్నారు.

➡️