ప్రశాంత ఎన్నికలకు ప్రతి ఒక్కరూ సహకరించాలి

ప్రజాశక్తి- రాయచోటి మే 13న సాధారణ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి అభిషిక్త్‌ కిషోర్‌ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్లో సాధారణ ఎన్నికల నిర్వహ ణపై ఎస్‌పి కష్ణారావుతో కలిసి ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ జిల్లాలో 2024 సాధారణ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అన్ని చర్యలు చేపడు తున్నామన్నారు. ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఎంసిసి ఫిర్యాదులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సమస్యలు పరిష్కరిస్తున్నామని చెప్పారు. నోటిఫికేషన్‌ వచ్చి నందున ఈనెల 25 వరకు నామినేషన్లు స్వీకరిం చామని చెప్పారు. ఏప్రిల్‌ 26న స్క్రూటీని, 29న ఉపసం హరణ ఉంటుందన్నారు. ఏప్రిల్‌ 29 తర్వాత నియోజకవర్గాల వారీగా ఎంత మంది అభ్యర్థులు బరిలో ఉండేది తెలుస్తుం దన్నారు. మొదటిరోజు నామినేషన్లకు సంబంధించి పార్ల మెంటుకు రెండు, రాజంపేట అసెంబ్లీకి 2 నామినేషన్లు, మదనపల్లె-1, పీలేరు-4, కోడూరు 1, తంబళ్లపల్లె-1 నామినేషన్లు వచ్చారని వివరించారు. జిల్లాలో 14,21,196 మంది ఓటర్లున్నారని, 1609 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఇవిఎం ర్యాండమైజేషన్‌ పూర్తి చేసి నియోజకవర్గాలలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్‌ రూములకు పకడ్బందీగా పంపామని తెలిపారు. జిల్లాల మొత్తంగా ఆరుగురు అబ్జర్వర్లు నియమించామని తెలిపారు. వీరిలో ఒకరు పార్లమెంట్‌ నియోజకవర్గానికి, రాయచోటి, రాజం పేట, కోడూరు, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఒక అబ్జర్వర్‌ ఉంటారన్నారు. ఇంకొక జనరల్‌ అబ్జర్వర్‌ మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె మూడు నియోజకవర్గాలకు అబ్జర్వర్‌ ఉంటారన్నారు. మే 2లోగా పోస్టల్‌ బ్యాలెట్లు వస్తుందని 5 నుంచి 8వ తేదీ వరకు నియోజకవర్గాల వారీగా పోస్టల్‌ బ్యాలెట్‌ కార్యక్రమం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జిల్లాలో 2.37 లక్షల ఎపిక్‌ కార్డులు పంపిణీ చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఇప్పటికే రెండు లక్షలు పంపిణీ చేశామని తెపారు. అభ్యర్థుల వ్యయ పరిమితికి సంబంధించి ఎంపీ నియోజకవర్గానికి రూ. 95 లక్షలు, ఎమ్మెల్యే నియోజకవర్గానికి రూ. 40 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. సాధారణ ఎన్నికలకు సంబం ధించి కలెక్టరేట్లో ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామన్నారు. ఈ ఎన్నికలను విజయవంతం చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ పూర్తి సహాయ సహకారాలు అందజేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఎస్‌పి మాట్లాడుతూ ఎన్నికలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.

➡️