ప్రభుత్వ భూములు దోపిడీ

ప్రజాశక్తి – కడప అర్బన్‌ ప్రభుత్వ భూములను వైసిపి ముఖ్య నాయకులు ముఠాగా ఏర్పడి దోచేశారని, ప్రజలకు కనీసం మంచినీరు కూడా ఇవ్వలేని దుస్థితి ఏర్పడిందని, ఇలా ంటి వారికి మళ్ళీ ఓటేస్తే అభివద్ధి శూన్య మేనని పిసిసి అధ్యక్షులు వైఎస్‌. షర్మిల అన్నారు. శనివారం కడప నగరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు వైసిపికి అధికారం ఇస్తే అక్రమాలకు వినియో గించుకుందని విమర్శించారు. డిప్యూటీ సిఎం అంజాద్‌ బాషా, మల్లికార్జున రెడ్డి, మే యర్‌ సురేష్‌ బాబు, ఎంఎల్‌ఎ రవీంద్రనాథ్‌ రెడ్డి ప్రభుత్వ భూములు దోచేశారని తెలిపారు. ఈనాటికీ కడప అభివద్ధి అంటే వైఎస్‌ఆరే అని అన్నారు. కడపలో వైసిపి చేసిన అభివద్ధి శూన్యమని చెప్పారు. కనీసం మంచినీళ్ళు ఇవ్వలేని దుస్థితిలో వైసిపి పాలకులు ఉన్నారని విమర్శించారు. వైసిపి, టిడిపి, బిజెపికి తొత్తులుగా, బాని సలుగా మారాయని విమర్శించారు. బిజెపి దేశంలో మతాల మధ్య చిచ్చు పెట్టి ఆ మంటల్లో చలికా చుకుంటుందని ఆరో పించారు. ముస్లిము లకు వైఎస్‌ రాజశే ఖర్‌రెడ్డి 4 శాతం రిజ ర్వషన్లు తెచ్చారని, ఇప్పుడు బిజెపి వాటిని రద్దు చేయాలని చూస్తుందని తెలిపారు. మతపరమైన రిజర్వేషన్లు అని కామెంట్స్‌ చేస్తుందని చెప్పారు. వెనుకబడిన ముస్లిము కుటుం బాలకు ఇచ్చే రిజర్వేషన్లు మతపరం ఎలా అవుతాయని ప్రశ్నించారు. బిజెపి ఇలాంటి కామెంట్స్‌ చేస్తుంటే జగన్‌ ఒక్కరోజు కూడా ప్రశ్నించక పోవడం దుర్మార్గమన్నారు. మణిపూర్‌లో క్రిస్టియన్ల ఊచకోత జరుగుతుంటే నోరు విప్పలేదని పేర్కొన్నారు. పార్లమెంట్‌లో చట్టాలు చేస్తుంటే జగన్‌, బాబు మౌనం వహించారు తప్పితే నోరు విప్పలేదని వాపోయారు. సిఎఎ, ఎన్‌ఆర్‌సి చట్టాలు తెచ్చి బిజెపి ముస్లిముల మధ్య చిచ్చు పెడుతుందని తెలిపారు. ముస్లిములను వేరేలా చూపించే ప్రయత్నం చేస్తుందని పేర్కొన్నారు. ఇంత జరుగుతున్నా వైఎస్‌ఆర్‌ వారసుడు ఒక్కనాడు స్పందించలేదని చెప్పారు. చంద్రబాబు, జగన్‌మోహన్‌రెడ్డి ఇద్దరిలో ఎవరికి ఓటు వేసినా బిజెపికి వేసినట్లేనని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అధికారంలో వస్తేనే ముస్లిములకు భద్రత ఉంటుందని పేర్కొన్నారు. 10 ఏళ్లుగా రాష్ట్రాన్ని బాబు ,జగన్‌ సర్వ నాశనం చేశారని తెలిపారు. అభివద్ధిలో 25 ఏళ్లు వెనక్కి నెట్టారని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదు, రాజధాని లేదు, మద్యంలో తప్పా అభివద్ధి ఎక్కడా లేదు అన్నారు. కడప ఎంపీగా మళ్ళీ అవినాష్‌ రెడ్డికే జగన్‌ టికెట్‌ ఇచ్చారని, వివేకాను, అవినాష్‌ హత్య చేయించినట్లు సిబిఐ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. జగన్‌ తన పదవి అడ్డుపెట్టి మరి కాపాడుతున్నారని తెలిపారు. అరెస్టు కానివ్వకుండా చూస్తున్నారని చెప్పారు. నిందితుడికి మళ్ళీ పట్టం కట్టాలని చూస్తున్నారని పేర్కొన్నారు. చట్టసభలో నిందితులు అడుగు పెట్టకూడదనే తాను పోటీ చేస్తున్నానని పేర్కొన్నారు. కడప ఎంపీగా తనను గెలిపించాలని కోరారు. కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే అన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్‌ మాట్లాడుతూ కేంద్రంలో ఇండియా వేదిక అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. వైసిపి, టిడిపి, జనసేన, బిజెపిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ కడప ఎమ్మెల్యే అభ్యర్థి అఫ్జల్‌ఖాన్‌ మాట్లాడుతూ ఎంపీగా షర్మిలాను, ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సేవ చేసేందుకు వస్తున్నామని పేర్కొన్నారు. . నగరంలో మంచినీటి స్థానంలో మురుగునీరు వస్తున్నాయని పేర్కొన్నారు. . కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి వెంకట శివ, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అలీ ఖాన్‌, సలావుద్దీన్‌, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.మాసాపేట సర్కిల్లో మాట్లాడుతున్న వైఎస్‌ షర్మిల ఇలాంటి కామెంట్స్‌ చేస్తుంటే జగన్‌ ఒక్కరోజు కూడా ప్రశ్నించక పోవడం దుర్మార్గమన్నారు. మణిపూర్‌లో క్రిస ి్టయన్ల ఊచకోత జరుగుతుంటే నోరు విప్పలేదని పేర్కొన్నారు. పార్లమెంట్‌లో చట్టాలు చేస్తుంటే జగన్‌, బాబు మౌనం వహించారు తప్పితే నోరు విప్పలేదని వాపోయారు. సిఎఎ, ఎన్‌ఆర్‌సి చట్టాలు తెచ్చి బిజెపి ముస్లిముల మధ్య చిచ్చు పెడుతుందని తెలిపారు. ముస్లిములను వేరేలా చూపించే ప్రయత్నం చేస్తుందని పేర్కొన్నారు. ఇంత జరుగుతున్నా వైఎస్‌ఆర్‌ వారసుడు ఒక్క నాడు స్పందించలేదని చెప్పారు. చంద్ర బాబు, జగన్‌మోహన్‌రెడ్డి ఇద్దరిలో ఎవరికి ఓటు వేసినా బిజెపికి వేసినట్లేనని పేర్కొన్నారు. కాం గ్రెస్‌ అది óకారంలో వస్తేనే ముస్లిములకు భద్రత ఉం టుందని పేర్కొన్నారు. 10 ఏళ్లుగా రాష్ట్రాన్ని బాబు ,జగన్‌ సర్వ నాశనం చేశారని తెలిపారు. అభివద్ధిలో 25 ఏళ్లు వెనక్కి నెట్టారని విమ ర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదు, రాజ ధాని లేదు, మద్యంలో తప్పా అభివద్ధి ఎక్కడా లేదు అన్నారు. కడప ఎంపీగా మళ్ళీ అవినాష్‌ రెడ్డికే జగన్‌ టికెట్‌ ఇచ్చారని, వివేకాను, అవి నాష్‌ హత్య చేయించినట్లు సిబిఐ దగ్గర అన్ని ఆధారాలున్నాయని పేర్కొన్నారు. జగన్‌ తన పదవి అడ్డుపెట్టి మరి కాపా డుతున్నారని తెలి పారు. అరెస్టు కానివ్వకుండా చూస్తున్నారని చెప్పారు. నిందితుడికి మళ్ళీ పట్టం కట్టాలని చూ స్తున్నారని పేర్కొన్నారు. చట్టసభలో నిందితులు అడుగు పెట్టకూడదనే తాను పోటీ చేస్తున్నానని పేర్కొన్నారు. కడప ఎంపీగా తనను గెలిపిం చాలని కోరారు. కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే అన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి జి. చంద్రశేఖర్‌ మాట్లాడుతూ కేంద్రంలో ఇండియా వేదిక అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. వైసిపి, టిడిపి, జనసేన, బిజెపిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ కడప ఎమ్మెల్యే అభ్యర్థి అఫ్జల్‌ఖాన్‌ మాట్లాడుతూ ఎంపీగా షర్మిలాను, ఎమ్మెల్యేగా తనను గెలిపి ంచాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సేవ చేసే ందుకు వస్తు న్నామని పేర్కొన్నారు. . నగరంలో మంచినీటి స్థానంలో మురుగునీరు వస్తున్నాయని పేర్కొ న్నారు. కార్యక్రమంలో సిపిఐ నగర కార్య దర్శి వెంకటశివ, నాయకులు అలీ ఖాన్‌, సలావుద్దీన్‌, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️