రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులు

May 20,2024 23:27 #urea at Raitu Bharosa centres
Urea at Raitu Barosa centres

ప్రజాశక్తి- ఆనందపురం : ప్రతి రైతు భరోసా కేంద్రంలోనూ ఎరువులు సిద్ధంగా ఉంచాలని ఏపీ మార్కెటింగ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జి.రాజశేఖర్‌బాబు ఆదేశించారు. ఆనందపురం మండలంలోని బోణి రైతు భరోసా కేంద్రాన్ని, పద్మనాభం మండలంలోని మద్ది రైతు భరోసా కేంద్రాన్ని సోమవారం ఆయన సందర్శించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా జరుగుతున్న ఎరువుల పంపిణీని తనిఖీ చేశారు. గ్రామ సచివాలయాలలో ఉన్న వ్యవసాయ గోదాములలో ఎరువులను నిల్వ ఉంచుకోవాలని సూచించారు. ఎరువుల పంపిణీలో జాప్యాన్ని నివారించేందుకు ప్రతి రైతు భరోసా కేంద్రంలో కనీసం 20 టన్నులు ఎరువులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు మద్దిలో రైతులు తాము పండించిన మొక్కజొన్న, చోడి పంటను సకాలంలో కొనుగోలు చేయాలని, రైతులు కొంత పంటను అమ్మివేసిన తరువాత కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. పంటల కొనుగోలు క్యాలెండరు తయారు చేయాలని, కనీసం 15 రోజులు ముందుగానే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి కె.అప్పలస్వామి, భీమిలి సహాయ వ్యవసాయ సంచాలకులు బి.విజరుప్రసాద్‌, మార్క్‌ఫెడ్‌ డిఎం కె.రమేష్‌, ఆనందపురం వ్యవసాయాధికారి సిహెచ్‌.సంధ్యరత్నప్రభ, స్థానిక విఎఎలు, రైతులు పాల్గొన్నారు.

➡️