చెవిలో పువ్వులతో మాజీ ఎమ్మెల్యే బండారు నిరసన

Jan 23,2024 14:27 #West Godavari District

ప్రజాశక్తి-నరసాపురం : సీఎం జగన్‌ , నర్సాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్‌ రాజు అభివృద్ధి పేరుతో ప్రజల్ని మోసం చేశారంటూ.. సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద చెవిలో పువ్వులతో మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు నిరసన తెలిపారు. రూ.3,200 కోట్లుతో హార్బర్‌ , యూనివర్సిటీ, వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్ట్‌ వంటి పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్‌ 14 నెలలు క్రితం శంకుస్థాపన చేశారని.. నేటికీ ఈ పనులన్నీ శిలాఫలకాలికే పరిమితం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్‌, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరు చేసిన మోసాలకు న్యాయం చేయాలంటూ ఆర్డీవో అంబరీష్‌కు వినతి పత్రం అందజేశారు.

➡️