ఏప్రిల్‌ 31వరకు ధాన్యం కొనుగోలు చేయాలి : ఏపీ కౌలు రైతు సంఘం

ప్రజాశక్తి-చల్లపల్లి : ఏప్రిల్‌ 31 వరకు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయాలని ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి శీలం నారాయణరావు ప్రభుత్వాన్ని కోరారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఇంకా జిల్లాలో ధాన్యం నూర్పిడిలు కొనసాగుతున్నాయని, మార్చి నెల ఆఖరితో ధాన్యం కొనుగోలు ఆపివేస్తారని వార్తలు రావటంతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు నిలిపివేస్తే నూరిపిడి చేసిన ధాన్యాన్ని ఎవరికి అమ్ముకోవాలో అర్థం కాక రైతుల అయోమయ పరిస్థితి ఎదుర్కొంటారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు కౌలుదారులకు సకాలంలో బకాయిలు రాకపోవటంతో చేసిన అప్పులు తీర్చలేక నాన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విచారం వ్యక్తం చేశారు. జిల్లాలో ఇంకా నూర్పుడి చేయని కుప్పలు చాలా ఉన్నాయని, ఆ ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్‌ నెల వరకు చివరి వరకు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు కావలసిన గోనె సంచులు, రవాణా సౌకర్యం కల్పించాలని కోరారు. రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వ మే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు.

➡️