అతి తక్కువ జీతాలు ఇవ్వటం నేరం

Jan 14,2024 11:54 #Guntur District
anganwadi workers strike 34th day bhogi

ప్రజాశక్తి-చిలకలూరిపేట : అంగన్వాడీలకు అతి తక్కువ జీతాలు ఇవ్వటం నేరమని అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్మా చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని ప్రజాసంఘాల నాయకులు కౌలు రైతు సంఘం అంగన్వాడీల సమ్మెకు సంఘీ భావముగా ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏలూరు, చిలకలూరి పేట, మానుకొండవారిపాలెం, దండమూ డి గొట్టిపాడు మిట్టపాలెం నాగబైరు వారిపాలెం గోరంట్ల వారి పాలెం ఈపూరు వారి పాలెం పసుమర్రు తదితర గ్రామాల్లో ఆదివారం నాడు కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి పెరుబోయిన వెంకటేశ్వర్లు, కౌలు రైతు సంఘం చిలకలూరిపేట డివిజన్ అధ్యక్షులు సాతులూరి లూథర్, కెవిపిఎస్ జిలా సహాయ కార్యదర్శి ఎం.విల్సన్ మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ ధనికుల చిన్నారులకు చిల్డ్రన్స్ కెర్లు ఉన్నాయని పేదలకు నిరు పేదల పిల్లలకు ఈ అంగన్వాడీ కేంద్రాలే దిక్కు అన్నారు. కూలీ నాలి చేసుకునే పేదల పిల్లలకు తల్లి తండ్రి అయి సేవలను, పోషక ఆహారాన్ని అందిస్తున్నటువంటి ఈ కేంద్రాల నిర్వాహుకులను 34 రోజుల నుంచి రోడ్ల పాలు చెయ్యటం అన్యాయమన్నారు. అంతే కాక కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ధరలు, పెట్రోలు, డీజీలు, గ్యాస్ ధరలు పెంచితే జగన్మో హన్ రెడ్డి ప్రభుత్వం ఏం మాట్లాడలేదన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి రావలసిన భజన హామీలు రెవెన్యూ లోటు కడప ఉక్కు ఫ్యాక్టరీ అనేక విశ్వవిద్యాలయాలు ఇవ్వక పోయినా ఎదురు చెప్పలేరన్నారు. విశాఖ ఉక్కు టెలికం రైలు ఇతర ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్న రైతు వ్యతిరేక చట్టాలు వచ్చినా విద్యుత్ చట్టం తెచ్చిన మౌనం వహించాలన్నారు. కానీ అంగన్వాడీల కేంద్రాలకు తాళాలు పగలగొట్టడం ఆస్మా చట్టాన్ని ప్రయోగించడం షోకాజు నోటీసులు ఇవ్వటం అరెస్టులు చేయటం లాంటి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాంటి పనులు చేయటం దారుణం అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి అంగన్వాడీలకు న్యాయమైన కోరికలను వెంటనే ఆమోదించి వారిపై ఉపయోగించిన ఎస్మా చట్టాన్ని తదితర రద్దు చేసి ఈ దీక్షలు ఆపించాలన్నారు.

➡️