హోరాహోరీగా ప్రచారాలు

ప్రత్యేక హోదా కోసం గెలిపించండి : కాంగ్రెస్‌ప్రజాశక్తి-వేంపల్లె ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని పులివెందుల అసెంబ్లీ కాంగ్రెస్‌ అభ్యర్థి ధృవకుమార్‌రెడ్డి కోరారు. స్థానిక బుడిది కుంట, గాజులపేట, ఆర్టీసీ బస్టాండ్‌ ప్రాంతాల్లో గురువారం ఆయన పిసిసి మీడియా చైర్మన్‌ తులసిరెడ్డి, కాంగ్రెస్‌ నేత నర్రెడ్డి రాజశేఖర్‌ రెడ్డితో కలిసి ప్రచారం చేశారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కాంగ్రెస్‌ పార్టీనే అని, ఆ పార్టీని గెలిపించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. ఇందిరమ్మ రాజ్యం మళ్లీ రావాలంటే హస్తం గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్‌ పార్టీ పట్ల ప్రజల్లో మంచి స్పందన ఉందన్నారు. ఎంపీగా పోటీ చేస్తున్న వైఎస్‌ షర్మిలను, ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తనను గెలిపించాలని ధృవకుమార్‌రెడ్డి అభ్యర్థించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నేతలు సింగం రామకృష్ణారెడ్డి, బాలం సుబ్బరాయుడు, వేమా రాజా, వెంకటేష్‌, వినరు, రవి, ఉత్తన్న, మదార్‌ పాల్గొన్నారు.వైసిపి అభ్యర్థులకు ఓటేయండిప్రజాశక్తి-సింహాద్రిపురం రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి అభ్యర్థులకు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ మండల ఎన్నికల ఇన్‌ఛార్జి గండ్లూరి వీరశివారెడ్డి కోరారు. గురువారం మండలంలోని కసునూరులో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరశివారెడ్డి మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌ అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారన్నారు. అర్హతగల ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందాయన్నారు. కార్యక్రమంలో వైసిపి మండల కన్వీనర్‌ దేవిరెడ్డి శ్రీకాంత్‌ రెడ్డి, నాయకులు బ్రహ్మానందరెడ్డి, రామ్మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.33వ వార్డులో టిడిపి ప్రచారంప్రజాశక్తి – ప్రొద్దుటూరు (పుట్టపర్తి సర్కిల్‌) టిడిపి ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం స్థానిక మున్సిపల్‌ 33వ వార్డులో మాజీ కౌన్సిలర్‌ జిలాన్‌బాషా ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి కూటమి బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి ఇంటింటికి తిరిగారు. టిడిపి మేనిఫెస్టోలో పొందుపరిచిన సూపర్‌ సిక్స్‌ పథకాలను వివరించారు. కడప టిడిపి ఎంపీ అభ్యర్థి చదిపిరాళ్ల భూపేష్‌రెడ్డిని, ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో విఎస్‌ ముక్తియార్‌, ఇవి సుధాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ ఆసం రఘురామిరెడ్డి, చౌటపల్లి లక్ష్మీరెడ్డి, సుబ్బిరెడ్డి, ఖాదరాబాద్‌ వేణు, దస్తగిరి, తాటి శ్రీనివాసులు యాదవ్‌, గొల్లపూడి గోవిందమ్మ, వెంకటలక్ష్మి, సువర్ణ, పలువురు క్రియాశీలక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.సంక్షేమ పథకాల ప్రభుత్వాన్ని ఆదరించండిప్రజాశక్తి-వేంపల్లె సంక్షేమ పథకాలను ప్రతి ఏడాది నిరంతరంగా కొనసాగిస్తున్న వైసిపి ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపించేందుకు ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయాలని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి సతీమణి సమత, వైసిపి మహిళ నేత సుమతి కోరారు. వేంపల్లెలోని బొడ్డు చావిడి, బిడ్డాల మిట్ట, గరుగువీధి, పాత బ్యాంకు వీధి, కాలేజీ రోడ్డులో ప్రాంతాల్లో గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటి ప్రచారం చేశారు. రెండు సార్లు ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రవికుమార్‌ రెడ్డి, మండల కన్వీనర్‌ చంద్రఓబుల్‌ రెడ్డి, సతీష్‌కుమార్‌రెడ్డి, సర్పంచ్‌ రాచినేని శ్రీనివాసులు, ఎంపిపి లక్ష్మి గాయత్రి, సివిల్‌ సప్లరు డైరెక్టర్‌ షబ్బీర్‌ వలి, హజ్‌ హౌస్‌ డైరెక్టర్‌ మునీర్‌, చాను, సతీష్‌ తనయుడు తుషార్‌ నాగిరెడ్డి, షాదీఖానా కమిటీ అధ్యక్షుడు బిఎస్‌ షెక్షావలి, యూసుఫ్‌ జమిల్‌, రవిశంకర్‌ గౌడ్‌, మటన్‌ బాబా, హబిబుల్లా, కటిక చంద్ర శేఖర్‌, భారతి పాల్గొన్నారు. ఆదరించి ఆశీర్వదించండిప్రజాశక్తి-చెన్నూరు ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్మోహన్‌రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు కుల, మత వర్గ బేధాలు లేకుండా పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలను అందించారని, మళ్లీ అవకాశం కల్పిస్తే రాష్ట్ర అభివద్ధికి తోడ్పడిన వారమవుతామని కమలాపురం ఎమ్మెల్యే అభ్యర్థి పోచంరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి ఉపాధి కూలీలను కలిసి ఓట్లు అభ్యర్థించారు. గురువారం ఉదయం 6 గంటలకు ఆయన ఉపాధి పనులు చేసుకుంటున్న కూలీలను కలిసి ఓట్లు అడిగారు. చెన్నూరు మండలం ఉప్పరపల్లె, శివాలపల్లె, చెన్నూరు, ముండ్లపల్లె, రాచినాయ పల్లె, రామనపల్లి, కొండపేట, బలసింగనపల్లె, కోక్కరాయపల్లె పరిధిలోని ఉపాధి కూలీల వద్దకు వెళ్లి వారితో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాబోయేది మళ్లీ జగన్‌ ప్రభుత్వమేనని ఎవరు ప్రతి ఒక్కరి సమస్యలకు పరిష్కారం మార్గం చూపుతానని ఫ్యాన్‌ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో వైసిపి జిల్లా ఉపాధ్యక్షులు టిటిడి బోర్డు మెంబర్‌ మా సీమ బాబు, గుమ్మా రాజేంద్రప్రసాద్‌రెడ్డి, జడ్‌పిటిసి దిలీప్‌రెడ్డి, ముదిరెడ్డి సుబ్బారెడ్డి, ఎంపిటిసి ఎర్ర సాని నిరంజన్‌ రెడ్డి, మాజీ ఎంపిటిసి నరసయ్య, నవనీశ్వర్‌ రెడ్డి, కొండారెడ్డి, ఓబుల్‌రెడ్డి, దుంప నాగిరెడ్డి, సర్పంచ్‌ తుంగ చంద్రశేఖర్‌ యాదవ్‌, భాస్కర్‌ రెడ్డి, రఘురాం రెడ్డి, సొంతం నారాయణరెడ్డి, వైసిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.వైసిపిలోకి అమీర్‌బాబు సోదరుడు ప్రజాశక్తి -కడప అర్బన్‌ టిడిపి నాయకులు అమీర్‌ బాబు సోదరుడు నిస్సార్‌ అహమ్మద్‌ వైసిపిలో చేరారు. గురువారం ఆయన స్వగహంలో కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా కండువా వేసి వైసిపిలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైసిపి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. టిడిపిలో మైనార్టీలకు సముచిత స్థానం లేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో మైనార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.అరాచకాలను సహించం : టిడిపి ప్రజాశక్తి- కడప అర్బన్‌ వైసిపి అరాచకాలను, అన్యాయాలను సహించేది లేదని టిడిపి జిల్లా నాయకులు పేర్కొన్నారు. గురువారం టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్‌ మాధవి గెలుపు కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. 44వ డివిజన్‌ బాలాజీ నగర్‌, సత్తార్‌ కాలనీలో ఇంటింటి ప్రచారాం చేశారు. చంద్రబాబు నాయుడు ప్రవేశ పెట్టినటువంటి సూపర్‌ సిక్స్‌ పథకాలను అందరికీ వివరించారు. చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా చేసుకుంటే మనకు అన్ని విధాలుగా మంచి ఉంటుందని పేర్కొన్నారు. మాధవి ప్రవేశపెట్టిన తన సొంత మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అలాగే ఎంపీ అభ్యర్థి భూపేష్‌ రెడ్డిను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బండిబాబు, గోపిశెట్టి నాగరాజు, సత్య, టిడిపి కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

➡️