అధికారం ఇస్తే రాజంపేటను జిల్లా కేంద్రం చేస్తాం

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌/రైల్వేకోడూరుఎన్‌డిఎ కూటమి అధికారంలోకి వస్తే రాజంపేటను జిల్లా కేంద్రంగా చేస్తామని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ ఉమ్మడిగా రాజంపేట, రైల్వేకోడూరుల్లో ప్రజాగళం బహిరంగ సభలు నిర్వహించారు. ఆయా సభల్లో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ జగన్‌ పాలనలో ధరలు ఆకాశాన్నంటి పేద, మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలు అడుగంటాయని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే కూటమిగా ఎన్నికల్లోకి వెళుతున్నామని, సైకో పాలను చరమగీతం పలికి ఎన్‌డిఎ కూటమి అధికారంలోకి వచ్చేందుకు మొట్టమొదట రాజంపేటతోనే శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. టిడిపి సూపర్‌ సిక్స్‌ పథకాలతో రాష్ట్రంలో సంక్షేమం తీసుకొస్తామని తెలిపారు. రాజంపేట వాసులు ఆదరించి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డిలను డిపాజిట్లు కూడా దక్కకుండా కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. రాజంపేట వాసులు జీర్ణించుకోలేని అంశం జిల్లా కేంద్రం, వైద్య కళాశాలలు తరలిపోయాయని, ఇందుకు పెద్దిరెడ్డి కుటుంబమే ముఖ్య కారణమని ఆరోపించారు. ఇసుక దోపిడీ కారణంగా అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయి సుమారు 40 మంది మృత్యువాత పడితే వైసిపి ప్రభుత్వం నేటికీ వారిని ఆదుకున్న పాపాన పోలేదన్నారు. తాము అధికారంలోకి వస్తే పింఛ, అన్నమయ్య డ్యాములు పునర్నిర్మించి మాచుపల్లి బ్రిడ్జి నిర్మిస్తామని, గాలేరు నగరి కాలువ పూర్తి చేసి కృష్ణాజలాలు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. నందలూరు ఆల్విన్‌ ఫ్యాక్టరీతో పాటు పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. రాజంపేటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఒంటిమిట్టలో చేనేత కుటుంబానికి చెందిన సుబ్బారావు తన పిల్లల చదువుల కోసం తన నాలుగు ఎకరాల ఆస్తి అమ్మి ఆర్థిక సమస్యలు తీర్చుకోవాలని చూస్తే వైసిపి నాయకులు ఆయన భూమిని ఆక్రమించి చేనేత కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడే విధంగా దౌర్జన్యాలకు పాల్పడ్డారని ఆవేదన చెందారు.నాడు తెలుగుదేశం పార్టీ చేనేత కుటుంబానికి రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందజేసి అండగా నిలబడ్డామని తెలిపారు. మృతుడు సుబ్బారావు కుమార్తెను బహిరంగ సభలో దగ్గరకు తీసుకుని ఓదార్పునిచ్చారు. లక్ష్మీ ప్రసన్నపై చదువులకు తాము అండగా ఉంటామని, ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ ఇసుక దోచుకోవడం కోసం ముందస్తు హెచ్చరికలను బేఖాతరు చేసి అన్నమయ్య డ్యాం కొట్టుకొని పోవడానికి స్థానిక నేతలు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డిలే కారణమని పేర్కొన్నారు. లస్కర్‌గా విధులు నిర్వహిస్తున్న రామయ్య ప్రాణాలు తెగించి ప్రజలను అప్రమత్తం చేయడం వలన కొంత ప్రాణనష్టం తప్పిందని, లస్కర్‌ రామయ్యను జనసేన పార్టీ రూ.2 లక్షలు ఆర్థిక సాయం చేసి సత్కరించిందని గుర్తు చేశారు. నియోజకవర్గం, పార్లమెంటు స్థాయిలో మార్పు తీసుకురావడం యువత వలనే సాధ్యమవుతుందని తెలిపారు. యువత, ప్రజలు ధైర్యంగా ముందుకు వచ్చి ఓటు ఆయుధంతో వైసిపి నాయకులను తరిమికొట్టాలని, ప్రజల ప్రాణాలకు తన ప్రాణాలు అడ్డువేస్తానన్నారు. కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి, ఎన్‌డిఎ కూటమి బిజెపి పార్లమెంట్‌ అభ్యర్థి నల్లారి కిరణ్‌ కుమార్‌రెడ్డి, టిడిపి అసెంబ్లీ అభ్యర్థి సుగవాసి బాలసుబ్రమణ్యం, టిడిపి పార్లమెంటు అధ్యక్షులు చమ్మర్తి జగన్మోహన్‌ రాజు, బిజెపి, టిడిపి, జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. రాజంపేట వాసులు జీర్ణించుకోలేని అంశం జిల్లా కేంద్రం, వైద్య కళాశాలలు తరలిపోయాయని, ఇందుకు పెద్దిరెడ్డి కుటుంబమే ముఖ్య కారణమని ఆరోపించారు. ఇసుక దోపిడీ కారణంగా అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయి సుమారు 40 మంది మృత్యువాత పడితే వైసిపి ప్రభుత్వం నేటికీ వారిని ఆదుకున్న పాపాన పోలేదన్నారు. తాము అధికారంలోకి వస్తే పింఛ, అన్నమయ్య డ్యాములు పునర్నిర్మించి మాచుపల్లి బ్రిడ్జి నిర్మిస్తామని, గాలేరు నగరి కాలువ పూర్తి చేసి కృష్ణాజలాలు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఒంటిమిట్టలో చేనేత కుటుంబానికి చెందిన సుబ్బారావు తన పిల్లల చదువుల కోసం తన నాలుగు ఎకరాల ఆస్తి అమ్మి ఆర్థిక సమస్యలు తీర్చుకోవాలని చూస్తే వైసిపి నాయకులు ఆయన భూమిని ఆక్రమించి చేనేత కుటుం బంలో ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడే విధంగా దౌర్జన్యాలకు పాల్పడ్డారని ఆవేదన చెందారు.నాడు తెలుగుదేశం పార్టీ చేనేత కుటుంబానికి రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందజేసి అండగా నిలబడ్డామని తెలిపారు. మృతుడు సుబ్బారావు కుమార్తెను బహిరంగ సభలో దగ్గరకు తీసుకుని ఓదార్పునిచ్చారు. లక్ష్మీ ప్రసన్నపై చదువులకు తాము అండగా ఉంటామని, ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ ఇసుక దోచుకోవడం కోసం ముందస్తు హెచ్చరికలను బేఖాతరు చేసి అన్నమయ్య డ్యాం కొట్టుకొని పోవడానికి స్థానిక నేతలు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డిలే కారణమని పేర్కొన్నారు. లస్కర్‌గా విధులు నిర్వహిస్తున్న రామయ్య ప్రాణాలు తెగించి ప్రజలను అప్రమత్తం చేయడం వలన కొంత ప్రాణనష్టం తప్పిందని, లస్కర్‌ రామయ్యను జనసేన పార్టీ రూ.2 లక్షలు ఆర్థిక సాయం చేసి సత్కరించిందని గుర్తు చేశారు. నియోజకవర్గం, పార్లమెంటు స్థాయిలో మార్పు తీసుకురావడం యువత వలనే సాధ్యమవుతుందని తెలిపారు. యువత, ప్రజలు ధైర్యంగా ముందుకు వచ్చి ఓటు ఆయుధంతో వైసిపి నాయకులను తరిమికొట్టాలని, ప్రజల ప్రాణాలకు తన ప్రాణాలు అడ్డువేస్తానన్నారు. కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి, ఎన్‌డిఎ కూటమి బిజెపి పార్లమెంట్‌ అభ్యర్థి నల్లారి కిరణ్‌ కుమార్‌రెడ్డి, టిడిపి అసెంబ్లీ అభ్యర్థి సుగవాసి బాలసుబ్రమణ్యం, టిడిపి పార్లమెంటు అధ్యక్షులు చమ్మర్తి జగన్మోహన్‌ రాజు, బిజెపి, టిడిపి, జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.మంగంపేటను దోచుకున్న పెద్దిరెడ్డి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్‌రెడ్డి కోడూరు ప్రాంతంలో మంగంపేట మైనింగ్‌ను దోచుకున్నారని వారికి ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. రైల్వేకోడూరు టిడిపి ఇన్‌ఛార్జి ముక్కా రూపనందరెడ్డి ఆధ్వర్యంలో ప్రజాగళం యాత్రలో భాగంగా రాత్రి రైల్వేకోడూరులో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని ముఖ్య మంత్రి జగన్‌ ఇంటికి పంపే సమయం ఆసన్నమైందన్నారు. రైల్వేకోడూరులో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా వైసిపి అభ్యర్థి గెలిచిన ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని ఆరోపించారు. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ పిఠాపురంలో నన్ను ఓడించేందుకు పెద్దిరెడ్డి పావులు కదుపుతున్నాడని అది అసంభవమన్నారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కస్తూరి విశ్వనాథ నాయుడు, మాజీ ఎమ్మెల్సీ టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగాల్రాయడు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

➡️