విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదు: సిఐ

ప్రజాశక్తి-గిద్దలూరు: శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని గిద్దలూరు అర్బన్‌ సీఐ సోమయ్య అన్నారు. మంగళవారం సాయంత్రం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ఫలితాల ముందు గాని, తరువాత గాని ఎవరైనా అల్లర్లు, గొడవలు సృష్టించాలని చూస్తే వారిని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కాగా ఇప్పటికే అన్ని పార్టీల రాజకీయ నాయకులకు అవగాహన కల్పించామని ఆయన తెలిపారు. పల్లెలలో కూడా పోలీసు సిబ్బంది పల్లె నిద్ర నిర్వహించి అక్కడ ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్డెన్‌ అండ్‌ సెర్చ్‌ ద్వారా అనుమానిత వ్యక్తులు ఎవరైనా సంచరిస్తున్నారా, ఏమైనా మారణ ఆయుధాలు కలిగి ఉన్నారా వంటి అంశాలపై నిఘా పెంచమని తెలిపారు. అలాగే మండలంలో 11 రూట్లలో పోలీసుల గస్తీ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. సోషల్‌ మీడియాలో కూడా రెచ్చగొట్టే పోస్టులు పెడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కాబట్టి మండలంలో ఎక్కడైనా గొడవలు కానీ, అల్లర్లు కానీ జరిగితే వెంటనే పోలీసులకు తెలపాలని అన్నారు. సమావేశంలో సీఐ సోమయ్యతో పాటు ఎస్‌ఐ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

➡️