ఏజెన్సీ అభివృద్ధి కావాలంటే అప్పలనర్సను ఎంపిగా గెలిపించుకుందాం : వైస్‌ ఎంపీపీ సూడిపల్లి కొండలరావు

Apr 21,2024 15:24 #Agency Area, #CPM candidate, #develop

ప్రజాశక్తి-హుకుంపేట (అల్లూరి) : ఏజెన్సీలో 100 శాతం ఉద్యోగాలు గిరిజనులకే రావాలన్నా, గ్రామాలకు తారు రోడ్లు గ్రాంట్‌ కావాలన్నా అరకు నియోజక వర్గం సిపిఎం ఎంపి అభ్యర్థి అప్పలనర్స ను గెలిపించుకుందామని హుకుంపేట వైస్‌ ఎంపీపీ సూడిపల్లి కొండలరావు ప్రజలను కోరారు. హుకుంపేట మండలంలోని రాప పంచాయితీ, కే.తాడిపుట్టు గ్రామంలో ఏర్పాటు చేసిన సమవేశంలో వైస్‌ ఎంపీపీ సూడిపల్లి కొండలరావు పాల్గొని మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ … ఐదు సంవత్సరాల కాలంలో వైసీపీ జగన్‌ ప్రభుత్వం ఏజెన్సీని అభివృద్ధి చేసింది ఏమీ లేదని అన్నారు. మెగా డీఎస్సీ అని దగా డీఎస్సీ అని ఒక్క నోటిఫికేషన్‌ కూడా విడుదల చేయలేదన్నారు. గ్రామ పంచాయితీ నిధులను వైసీపీ ప్రభుత్వం లాక్కోవడంతో సర్పంచ్‌ లు ఏజెన్సీలోని ఏ గ్రామానికి కూడా సీసీ రోడ్లు, డ్రైనేజీలు గ్రాంట్‌ చేయలేకపోయారని, తారు రోడ్లు లేక బురద రోడ్లే మిగిలాయని అన్నారు. గ్రామాల అభివృద్ధికి సిపిఎం ఎంపి అభ్యర్థి అప్పలనర్స ను గెలిపించడం ఉత్తమం అన్నారు. ఈ కార్యక్రమంలో తాడిపుట్టు వార్డ్‌ మెంబర్‌, మాజీ వార్డ్‌ మెంబర్‌ సీదరి భీమన్న, గ్రామ పెద్దలు శతక భీమన్న, కూతంగి సింహాద్రి మర్రి బాలు, కిల్లో అప్పారావు, కొండబాబు, జన్నిలింగన్న, సోమన్న, కోరుపల్లి నవీన్‌, జన్ని వెంకట్‌ మదేల రామారావు, మదేలా దేముడు, రేగం కామరాజు, శతక కోటేశ్వరరావు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

➡️