రహదారికి బీటలు

బీటలు బారిన రోడ్డు

ప్రజాశక్తి -అనంతగిరి: బీటీ రోడ్డు నిర్మించిన రెండు నెల్లలకే శిథిలావస్థకు చేరుకుంది. మండలంలోని లుంగపర్తి పంచాయతీ లుంగపర్తి గ్రామం నుండి దిగువపట్టి, ఎగువపట్టి మీదుగా చీడివలస నాలుగు గ్రామలకు ఏర్పాటు చేసిన ఈ రింగ్‌ రోడ్డు పనులు పూర్తి చేసిన రెండు నెల్లలకే బీటలు బారాయి. అదికారుల పర్యవేక్షణ లేకపోవడంతో గుత్తేదారులు ఇష్టారాజ్యంగా మారింది. అధికారుల పర్యవేక్షణ లేకనే శిథిలంఅనంతగిరి:అధికారుల పర్యావేక్షణ లోపం కారణంగానే బీటీ రోడ్డు రెండు నెల్లలకే దెబ్బతిందని సర్పంచ్‌ జన్ని సన్యసిరావు ఆరోపించారు. శనివారం రోడ్డు పరిశీలించిన అనంతరం స్దానిక విలేకరులతో మాట్లాడుతూ,లుంగపర్తి పంచాయతీ లుంగపర్తి గ్రామం నుండి మల్లేపాడు, దిగువపట్టి, ఎగువపట్టి మీదుగా తొమ్మిది గ్రామాలు 11 కిల్లో మీటర్ల మేర ఈ రింగ్‌ రోడ్డు పనులు పూర్తి చేసిన రెండు నెలలకే ఎక్కడ పడితే అక్కడ పెచ్చులు ఊడి పోతున్నాయని సర్పంచ్‌ తెలిపారు. తారు వేసినపుడు సరిగా రోలింగ్‌ చేయలేదన్నారు. లుంగపర్తి గెడ్డ పై నుండి లుంగపర్తి సచివాలయం వరకు పనులు చేయాల్సి ఉన్నప్పటికీ నిధులు చాలక పోవడంతో పనులు నిలిపి వేశారని, ప్రభుత్వం మంజూరు చేయాలని కోరారు.

➡️