చిట్టివలస జెడ్‌పి హైస్కూల్‌లో సిబిఎస్‌ఇ అమలు

May 18,2024 23:10 #cbse syallabus, #ZP High school
zp school , cbse starts this year

 ప్రజాశక్తి -తగరపువలస : చిట్టివలస జెడ్‌పి బాలుర ఉన్నత పాఠశాలలో 2024-25 విద్యా సంవత్సరం నుంచి టెన్త్‌లో సిబిఎస్‌ఇ సిలబస్‌ అమలు చేయనున్నారు. భీమిలి, ఆనందపురం, పద్మనాభం మండలాల పరిధిలో సుమారు 28 జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు ఉండగా, వీటిలో చిట్టివలస జెడ్పీ హైస్కూల్‌లో సిబిఎస్‌ఇ సిలబస్‌ అమలుకానుంది. ప్రత్యేకతలు ఇవీ..- జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలగా 1972లో ప్రారంభమైంది. అంకిత భావం గల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం ఉండడంతో 2018-19 విద్యా సంవత్సరం నుంచి 2022-23 వరకు ఇదే పాఠశాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు ట్రిపుల్‌ ఐటీలో ప్రవేశం పొందారు.- 2022-23 విద్యా సంవత్సరంలో టెన్త్‌లో మండలంలోనే అత్యధికంగా ఇదే పాఠశాల విద్యార్థి 585 మార్కులు సాధించారు. 17 మంది విద్యార్థులకు 500కు పైగా మార్కులు వచ్చాయి.-2018-19 విద్యా సంవత్సరం నుంచి 2023-24 వరకు 9 మంది విద్యార్థులు ఎన్‌ఎంఎంఎస్‌కు ఎంపికయ్యారు.- ట్రిపుల్‌ ఐటీ పోటీ పరీక్షలో ఇదే పాఠశాలకు చెందిన ఆర్‌ శ్రుతి భాను 2019లో 11వ ర్యాంకు సాధించి, మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ద్వారా ప్రశంసా పత్రం అందుకున్నారు.-ఏటా జరిగే కౌశల్‌ పోటీల్లో 2021 నుంచి పాఠశాల విద్యార్థులు మొదటి స్థానంలో నిలుస్తూ వస్తున్నారు.-చదువుతో పాటు సహ పాఠ్య కార్యక్రమాలకు ప్రాధాన్యం.-5వేల పుస్తకాలతో గ్రంథాలయం నిర్వహణ.-నాణ్యమైన, విశ్లేషణాత్మక బోధన – ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయోలజీ ల్యాబ్స్‌ ఏర్పాటు – డిజిటల్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ కలిగి ఉండడం-కంప్యూటర్‌లో శిక్షణ

➡️