బలిజలకు తీరని అన్యాయం.. గాంధీ విగ్రహం ఎదుట నిరసన

Feb 26,2024 16:06 #baliga, #chitoor, #raly

ప్రజాశక్తి-చిత్తూరు అర్బన్‌: అసెంబ్లీ ఎన్నికల్లో బలిజలకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ బలిజలు రాజకీయ పార్టీలపై బలిజ సంఘం జిల్లా అధ్యక్షులు ఓఎం రామదాసు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం స్థానిక నాగయ్య కళాక్షేత్రంలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి నివాళులర్పించి అక్కడి నుండి గాంధీ విగ్రహం వరకు బలిజ నాయకులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీ విగ్రహం ఎదుట అధికార ప్రతిపక్ష పార్టీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రామదాసు మాట్లాడుతూ.. జనాభాలో అత్యధికంగా ఉన్న బలిజలకు సీట్లు కేటాయించకుండా వైసిపి, టిడిపి అన్యాయం చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బలిజలను గుర్తించాలని కోరుతూ నిరాహార దీక్షలకు పూనుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బలిజ నాయకులు పూలచంద్ర, నందగోపాలతో పాటు చిత్తూరు నియోజకవర్గ పరిధిలోని బలిజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

➡️