అర్హులందరికీ ఇళ్ళ స్థలాలు ఇవ్వాలి: వర్మ

Feb 8,2024 23:06
స్థానిక 15వ వార్డులో

ప్రజాశక్తి – పిఠాపురం

స్థానిక 15వ వార్డులో అర్హులైన నిరుపేదలను గుర్తించి వారికి ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని మాజీ ఎంఎల్‌ఎ ఎస్‌విఎస్‌ఎన్‌.వర్మ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం మున్సి పల్‌ కమిషనర్‌ కనకారావుకి వినతి పత్రం అంద జేశారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ పట్ట ణంలోని 15వ వార్డ్‌ లో ఇటివల ఇచ్చిన జగనన్న ఇళ్ళ పట్టాలు భూములు, ఆస్తులు ఉన్నవారికే ఇవ్వడం జరిగిందన్నారు. అర్హత ఉన్న లబ్దిదారులకు ఇవ్వలేదని వైసిపి నాయకులు నిరుపేదలకు పట్టాలు రాకుండా చేశారన్నారు. స్థానిక వైసిపి నాయకులు టిడిపికి చెందిన సానుభూతిపరులనే పేరుతో అర్హులను పక్కన పెడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డం భాస్కర రావు, పిల్లి చిన్న, కొండేపూడి సూర్యప్రకాష్‌, దేవరపల్లి రామారావు, కౌన్సిలర్‌లు ఎ.నగేష్‌, ఆర్‌.శ్రీను, కోళ్ళ బంగారు బాబు, నల్లా శ్రీను, నధిబాబు, పాల్గొన్నారు.

➡️