ఆదిత్య డిగ్రీ విద్యార్థుల పారిశ్రామిక పర్యటన

Mar 20,2024 23:38
స్థానిక ఆదిత్య డిగ్రీ కళాశాల

ప్రజాశక్తి – కాకినాడ

స్థానిక ఆదిత్య డిగ్రీ కళాశాల కామర్స్‌ విభాగం విద్యార్థులు పారిశ్రామిక పర్యటనలో భాగంగా విశాఖ ఉక్కు కర్మాగారం సందర్శించారు. ఈ పర్యటనలో కర్మాగారానికి చెందిన ట్రైనర్స్‌ గణేష్‌బాబు, పవన్‌, ఆరిఫ్‌ల పర్యవేక్షణలో, ప్రొడక్షన్‌, ఫైనాన్సు, మార్కెటింగ్‌, హెచ్‌ఆర్‌ మేనేజర్లతో విద్యా ర్థులు మాట్లాడి అనేక విషయాలపై సందేహాలను నివృత్తి చేసుకున్నారు. కామర్స్‌ విభాగం అధ్యాపకులు పి.నరసింహారావు పారిశ్రామిక యాత్రను పర్యవేక్షిం చారు. ఈ సందర్భంగా నట్లు కళాశాలల అకడమిక్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బిఇవిఎల్‌.నాయుడు మాట్లాడుతూ ఇలాంటి పారిశ్రామిక యాత్రల వల్ల విద్యార్థులలో విజ్ఞానంతోపాటు, నాయకత్వ లక్షణాలు పెరుగు తాయని తెలిపారు. ఈ పర్యటనను నిర్వహించిన కామర్స్‌ విభాగం హెచ్‌ఒడి డాక్టర్‌ ఆన్సర్‌ అలీ, విద్యార్థులను ఆదిత్య విద్యా సంస్థల అధినేత డాక్టర్‌ ఎన్‌. శేషారెడ్డి, డిగ్రీ కళాశాలల సెక్రెటరీ డాక్టర్‌ ఎన్‌.సుగుణా రెడ్డి, వైస్‌ ప్రిన్సిపల్‌ సత్యనారాయణ, క్యాంపస్‌ ఇన్‌ఛార్జ్‌ మూర్తి అభినందించారు.

➡️