ఉద్యోగ, ఉపాధ్యాయుల ధర్నా

Feb 17,2024 22:22
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర జెఎసి ఇచ్చిన

ప్రజాశక్తి – కాకినాడ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర జెఎసి ఇచ్చిన పిలు పులో భాగంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు శని వారం భోజన విరామ సమయంలో ఆర్‌డిఒ కార్యాల యం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం నిరసన ర్యాలీని చేపట్టారు. ఈ సందర్భంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జెఎసి అధ్యక్షులు గుద్దటి రామ్మోహన్‌ రావు మాట్లాడుతూ డిమాండ్ల పరిష్కారం నిమిత్తం వివిధ రూపాల్లో ప్రభుత్వానికి తెలిసేలా ఆందోళనలు చేస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగులకు రావలసిన ఎస్‌ఎల్‌, జిపిఎఫ్‌ లోన్స్‌, ఎపిజిఎల్‌ఐ, డిఎ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, 12వ పిఆర్‌సి ఆలస్యం అవుతున్నందున 30 శాతం మధ్యంతర భృతిని ప్రక టించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం నుంచి ఉద్యో గుల డిమాండ్లపై ఎటువంటి స్పందన లేనందున, ఈ నెల 20న మహాధర్నా, ర్యాలీ చేపట్టడం జరుగు తుందన్నారు. ఈ కారక్రమంలో అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయ, కార్మికులు, పెన్షన్నర్లు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నలుమూలల నుంచి పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జెఎసి నాయకులు పేపకాయల వెం కటకృష్ణ, మునికేషులు, అధ్యక్షుడు పాము శ్రీనివాస్‌, అర్‌వి.రమేష్‌, మోర్త శ్రీనివాస్‌, బి. మహేష్‌, కె.నగేష్‌, గోవిందరాజులు, తానీషా, గిరిధర్‌ పాల్గొన్నారు.

➡️