బాల్య వివాహాల నిరోధంపై కళాజాతా

Mar 30,2024 16:52
బాల్య వివాహాల నిరోధంపై

ప్రజాశక్తి – పెద్దాపురం

బాల్య వివాహాల నిరోధంపై కళాజాతను ప్రదర్శించారు. శనివారం స్థానిక కొండయ్య పేట గోలి చిన్న కొండయ్య మున్సిపల్‌ స్కూల్‌ వీధిలో బాల్యవివాహాల అనర్ధాలపై అవగాహనా కళాజాతా ఐసిడిఎస్‌ సిడిపిఓ జి.ఉష పర్యవేక్షణలో సూపర్‌వైజర్‌ ఎ.చంద్రకళ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన బుర్రకథ కళారూపం ఆకట్టుకుంది. ఈ కళారూపం ద్వారా బాల్యవివాహాల వల్ల అనర్ధాలపై తల్లిదండ్రులకు, బాలికలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సూపర్‌వైజర్‌ చంద్రకళ మాట్లాడుతూ బాల్య వివాహాలను అరికట్టడంలో ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. బాల్య వివాహాల వల్ల జరిగే అనర్ధాలు, ఆరోగ్య సమస్యలు, బాల్య వివాహాలు నిర్వహించే వారిపై కేసులు వంటి వాటి పై అవగాహన కల్పించారు. ఎక్కడైనా బాల్యవివాహాలు జరుగుతున్నట్టు తెలిస్తే సమీపంలోని సచివాలయం, అంగన్‌వాడీ సెంటర్‌ బాధ్యులకు, పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.

➡️