లింగ నిష్పత్తి తక్కువపై దృష్టి సారించాలి

Jan 24,2024 22:50
లింగ నిష్పత్తి తక్కువగా

ప్రజాశక్తి – కాకినాడ

లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా సూచించారు. బుధవారం కాకినాడ కలెక్టర్‌ కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖ, స్త్రీ శిశు సంక్షేమం, స్వచ్ఛంద సంస్థల ప్రతి నిధులతో కలిసి జాతీయ బాలికా దినోత్సవం, మల్టీ మెంబర్‌ అప్ప్రోప్రియెట్‌ అథారిటీ, పిసి, పిఎస్‌డిటి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలిపారు. గర్భస్థ పిండ ఆరోగ్య పర్యవేక్షణకు సం బంధించిన పరీక్షలను లింగ నిర్ధారణకు దుర్వినియోగం కాకుండా అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ సెంటర్లపై నిఘా పెట్టా మన్నారు. ఆల్ట్రాసౌండ్‌ వైద్య పరీక్షలు లింగ నిర్ధారణకు ఉప యోగించుకోవడం చట్ట రీత్యా నేరమని, ప్రభుత్వ నిబం ధనలకు విరుద్ధంగా లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహించే స్కా నింగ్‌ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. జిల్లా ఫోర్త్‌ అడిషనల్‌ డిస్టిక్ట్‌ జడ్జ్‌ హరినారాయణ మాట్లాడుతూ జిల్లాలో పిసి అండ్‌ పి అండ్‌ డిటి యాక్ట్‌ ద్వారా 163 స్కానింగ్‌ కేంద్రాలపై ఆకస్మిక దాడులు నిర్వహించారని, ఎక్కడా ఒక కేసు కూడా నమోదు కాలేదని, దీనిపై పిసి అండ్‌ పిఎన్‌ డిటి యాక్ట్‌ ఎంతో సక్రమంగా అమలు చేస్తున్నదో అర్ధం అవుతుందన్నారు. బాలికలపై వివక్షత, విచక్షణ లేకుండా మగ పిల్లల మైండ్‌ సెట్‌ కూడా మార్చాలని మన కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు మగ పిల్లలు మైండ్‌ సెట్‌ కూడా మారాలని అప్పుడే బాలికలు మహిళలు సురక్షితంగా ఉంటారని అన్నారు. ఎస్‌పి ఎస్‌.సతీశ్‌ కుమార్‌ మాట్లాడుతూ బాలికలు ఏం చేయాలనే అంశంపై నిర్ధిష్టంగా నిర్ణయం తీసుకోవాలన్నారు తద్వారానే అడ్డంకులను అధిగమిచి విజయం సాధిస్తారని తెలిపారు. ఈ సమావేశంలో డిఎం అండ్‌ హెచ్‌ఒ జె.నరసింహ నాయక్‌ ఎస్‌సి పిసిఆర్‌ నెంబర్‌ ఆదిలక్ష్మి, ఐసిడిఎస్‌ పీడీ కె.ప్రవీణ, డిఇఒ డాక్టర్‌ రత్నకిషోర్‌, కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ లావణ్య కుమారి, డిసిహెచ్‌ఎస్‌ డాక్టర్‌ స్వప్న, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

➡️