అబ్బురపరిచిన శ్రీ చైతన్య విద్యార్థులు

Apr 22,2024 23:59
మండలంలోని సుంకరపాలెం

ప్రజాశక్తి – తాళ్లరేవు

మండలంలోని సుంకరపాలెం శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌ ఒకటి నుంచి 5వ తరగతి విద్యార్థులు సోమ వారం పలు రంగాల్లో ప్రతిభ ను ప్రదర్శించారు. సోమవారం జరిగిన కార్యక్రమంలో 4 సంవత్సరాల చిన్నారి డి.మీనాక్షి 50 సంస్కృత శ్లోకాలు అనర్గళంగా చెప్పి అబ్బురపరిచింది. ఎల్‌కెజి విద్యార్థినీలు కెవిబి శ్రీ సర్వగాయత్రి, డి.సహవి దేశంలోని అన్ని రాష్ట్రాలు, వాటి రాజధానులు, వి.మహిమా బాయి అనే మూడు న్నర సంవత్సరాల చిన్నారి ప్రతిష్టా త్మకమైన కెమిస్ట్రీలో నిష్ట్నాతులకు సమానంగా పిరియాడిక్‌ టేబుల్‌ ( ఆవర్తన పట్టిక) లో ఉన్న మొత్తం 118 మూలకాలు చెప్పి ఆశ్చర్య పరిచింది. కె రితిక, ఎల్‌కెజి విద్యార్థినులు జయసాన్విత 100 జికె ప్రశ్నలు, పి.అభిరామి సహస్ర వాల్మీకి రామాయణం గ్రంథంపై విశేష పరిజ్ఞానంతో ఏ కోణంలో ప్రశ్నిస్తున్న విశేష పురాణ ప్రతిభను కనబరిచి అబ్బురపరిచింది. యుకెజి విద్యార్థిని ఎం.శివకృత్య తెలుగులో విభిన్న సుభాషితాలు 50కి పైగా, జె.ప్రాన్వి నందన వందకు పైగా దేశాలు వాటి రాజధానులు, విఎస్‌ఎస్‌.శ్రియాన్‌ వందకు పైగా కరెంట్‌ ఎఫైర్స్‌, ఎం.కౌశిక్‌ దేశాలు -కరెన్సీ, బిఎస్‌ లాలిత్య సుభాషితాలు, ఎ.సహ స్ర వేమన పద్యాలు, జె.సహస్ర జీవ శాస్త్రంలో 50 జంతువులు వాటి బాల్య దశ, కె.హన్విత పూర్వ, ప్రస్తుత మంత్రుల పేర్లను అవలీలగా చెప్పింది. వీరి ప్రతిభ పాఠవాలు ఇలా ఉండగా 10 సంవత్సరాలలోపు ఉన్న 5వ తరగతిలోపు విద్యార్థులు గణిత శాస్త్రంలో 100 టేబుల్స్‌ అవలీలగా అత్యధిక ప్రతిభ కన బరిచారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్‌ డివివి.విజయ లక్ష్మి చిన్నారులను అభినందించారు.

➡️