చలివేంద్రాల ఏర్పాటు అవసరం

Apr 22,2024 23:56
పెరుగుతున్న వేసవి

ప్రజాశక్తి- సామర్లకోట

పెరుగుతున్న వేసవి ఎండల ఉష్ణోగ్రతల నేపథ్యంలో బాటసారుల దాహార్తిని తీర్చేందుకు చలి వేంద్రాల ఏర్పాటు అవసర మని, అందుకు దాతలు, పారిశ్రామికవేత్తలు ముం దుకు రావాలని మున్సిపల్‌ కమిషనర్‌ జాస్తి రామారావు పిలుపునిచ్చారు. సామర్లకోట -పెద్దాపురం రోడ్లో అంబటి సుబ్బన్న ఆయిల్‌ కంపెనీ వద్ద కీర్తిశేషులు సింగవరపు హరి నాధరావు జ్ఞాపకార్థం సింగవరపు సాయి బాబా సోదరులు ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రం సోమవారం ఆయన ప్రారం భించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ రామా రావు మాట్లాడుతూ చలివేంద్రం ఏర్పాటుకు ముందుకు వచ్చిన సింగవరపు సాయిబాబా సోదరులను అభినందించారు. పెరుగుతున్న ఎండలకు అనుగుణంగా మరిన్ని చలి వేంద్రాలు ఏర్పాటుకు దాతలు ముందుకు రావాలని ఆయన కోరారు. తొలుత మజ్జిగ చలివేంద్రం రిబ్బన్‌ కత్తిరించి ప్రారంభించి అనంతరం మజ్జిగ పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో అంబటి సుబ్బన్న ఆయిల్‌ కంపెనీ ప్రతినిధులు సింగవరపు సాయి బాబు, తులసీధర్‌ రావు, సాంబశివరావు, సత్యనా రాయణ సోదరులు, లయన్స్‌ క్లబ్‌ ప్రతినిధులు కర్రీ ఆదినారాయణ రెడ్డి, నేతి వీరభద్ర, మున్సిపల్‌ మాజీ కౌన్సిలర్‌ కాపుగంటి పైడిరత్నం పాల్గొన్నారు.

➡️