మొండి వైఖరి విడాలి

Jan 8,2024 15:35 #Kakinada
municipal workers strike in kkd

ప్రజాశక్తి-గొల్లప్రోలు(పిఠాపురం) : శానిటేషన్ వర్కర్ల పట్ల ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని సిఐటియు నాయకులు నందీశ్వర రావు డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కరించాలని శానిటేషన్ వర్కర్స్ చేస్తున్న సమ్మె సోమవారం 13వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా సోమవారం నగర పంచాయతీ కార్యాలయాన్ని శానిటేషన్ వర్కర్లు ముట్టడించారు. ఈ సందర్భంగా నందీశ్వర రావు వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు యేసమ్మ లు మాట్లాడుతూ కనీస వేతనం ఇవ్వాలని, పర్మినెంట్ చేయాలని, చనిపోయిన వర్కర్ల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని సమ్మె చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఎన్నికల ముందు జగన్ కనీస వేతనం ఇస్తానని పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారని హామీ నేటికీ హామీగానే ఉండిపోయిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని పెండింగ్ లో ఉన్న హెల్త్ అలివేన్స్ కోవిడ్ కాలంలో బకాయిలో ఉన్న ఆరు నెలల వేతనాలను తక్షణం విడుదల చేయాలని అంతవరకు సమ్మె విరమించేది లేదన్నారు.దీని పై కమిషనర్ ఎం సత్యనారాయణ మాట్లాడాతూ సమస్యలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళుత అని స్థానికంగా ఉండే సమస్యల పరిష్కారం చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో వర్కర్స్ లోవబాబు,బి సత్యవతి,సిహెచ్ రామారావు,జి రాజులు,రాజమోహన్,రాములమ్మ, లక్ష్మి,పార్వతి,పైడిరాజు,సింహాచలం తదితరులు పాల్గొన్నారు .

➡️