ఎపిలో రికార్డు స్థాయిలో పోలింగ్‌లో పాల్గొనండి : ప్రధాని మోడి

May 13,2024 08:46 #PM Modi, #record, #Voting

న్యూఢిల్లీ : అసెంబ్లీ సహా లోక్‌సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు రికార్డు స్థాయిలో పోలింగ్‌లో పాల్గొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడి పిలుపునిచ్చారు. ముఖ్యంగా మొదటిసారి ఓటు వేసేవారు తప్పకుండా తమ హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరింత పెంచుతాయని ఆశిస్తున్నానన్నారు. అలాగే నాలుగో దశలో భాగంగా దేశవ్యాప్తంగా పోలింగ్‌ కొనసాగుతున్న అన్ని ప్రాంతాల్లోనూ ఓటర్లు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. ప్రతిఒక్కరూ తమ కర్తవ్యాన్ని నిర్వర్తించి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని మోడి పిలుపునిచ్చారు.

➡️