ఇక ఓటరు వంతు

May 12,2024 22:43
ఇక ఓటరు వంతు

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. పోలింగ్‌ నిర్వహణకు కావాల్సిన సామగ్రితో పోలింగ్‌ సిబ్బంది పయనమయ్యారు. బస్సులు, లాంచీలు, ఇతర వాహనాలపై కేటాయించిన పోలింగ్‌ బూత్‌లకు చేరుకున్నారు.  సార్వత్రిక ఎన్నికలు ఘట్టంలో పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు సోమవారం పోలింగ్‌ జరుగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్‌ నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం పార్లమెంట్‌ స్థానాలకు 36 మంది, 21 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు 254 మంది అభ్యర్థులు బరిలో నిలుచున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఇటీవలే ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది. దీంతో ఉమ్మడి జిల్లాలో మొత్తం 47,88,681 మంది ఓటర్లు ఉన్నారు. కాకినాడ జిల్లాలో 16,34,122 మంది, అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో 15,31,410 మంది, తూర్పు గోదావరి జిల్లాలో 16,23,149 మంది ఉన్నారు. మూడు జిల్లాల్లో మొత్తం 4,858 బూత్‌లు ఏర్పాటు చేసారు. కాకినాడ జిల్లాలో 1,637, అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో 1,644, తూర్పు గోదావరి జిల్లాలో 1,577 ఉన్నాయి. మొత్తం 1261 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించిన అధికారులు పటిష్ట చర్యలు తీసుకున్నారు. కాకినాడ జిల్లాలో 331, కోనసీమ జిల్లాలో 563, తూర్పు గోదావరి జిల్లాలో 367 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. పోలింగ్‌ నిర్వహణకు పిఒలు, ఎపిఒలు ఇతర సిబ్బంది మూడు జిల్లాల్లో 33,279 మంది పని చేయనున్నారు. సుమారు 5 వేల మంది పోలీసులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు.1296 మంది మైక్రో అబ్జర్వర్లు నియమితులయ్యారు.కేంద్రాలకు చేరుకున్న పోలింగ్‌ టీములుమూడు జిల్లాల్లో ఉన్న 21 నియోజకవర్గాల్లో పోలింగ్‌ నిర్వహించడానికి ఆదివారం సాయంత్రానికే పోలింగ్‌

➡️