ప్రచారానికి ఇక రెండు రోజులే…

May 9,2024 23:17
సార్వత్రిక ఎన్నికల సమరానికి

ప్రజాశక్తి – సామర్లకోట

సార్వత్రిక ఎన్నికల సమరానికి కౌంట్‌ డౌన్‌ దగ్గర పడొతోంది. ప్రచార పర్వం ముగిసేందుకు ఇక కేవలం రెండు రోజులు మాత్రమే గడువు ఉండ టంతో ఆయా పార్టీల ప్రచారాలు పోటాపోటీగా కొనసాగుతు న్నాయి. అయితే ప్రచార ఘట్టం ముగింపు సమయాల్లో ప్రచా రాల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనకు తావులేకుండా పోలీస్‌ స్పెషల్‌ ఫోర్స్‌ బృందాలను పోలీస్‌ శాఖ ప్రచారాల తోపాటు ఏర్పాటు చేసింది. శనివారం సాయంత్రం వరకూ ఈ బృందాలు ప్రచారాల వెంట ఉంటారని స్థానిక సిఐ సురేష్‌ తెలిపారు. ఎన్నికల ప్రచారానికి కేవలం రెండు రోజులు మాత్రమే గడువు ఉండటంతో ప్రధాన పార్టీలు టిడిపి, వైసిపి అభ్యర్థులు నిమ్మకాయల చినరాజప్ప, దవులూరి దొరబాబు క్షణం తీరిక లేకుండా ప్రతి నిమిషాన్ని అమూల్యంగా భావించి నియోజకవర్గంలో ప్రచా రాన్ని సాగిస్తున్నారు. గంటకో గ్రామం, పూటకో మండలం చొప్పున ఎన్నికల ప్రచారాలను చేపడు తున్నారు. శనివారం సాయం త్రంతో ప్రచార గడువు ముగియ నుండగా అభ్యర్థులు వారి కుటుంబ సభ్యు లను సయితం ప్రచారాల్లో ఉంచి ముందుకు సాగుతున్నారు. ఇక కాంగ్రెస్‌ పార్టీతోపాటు ఇతర స్వతంత్రం అభ్యర్థులు వారి ప్రచారాలను వేగవంతం చేశారు.

➡️