సామర్లకోటకే తలమానీకం కొర్లమండ దంపతులు

May 23,2024 13:10 #Kakinada

బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షునికి అభినందన సత్కారం
ప్రజాశక్తి-సామర్లకోట : ప్రముఖ న్యాయవాది కొర్లమండ వీర భద్రరావు సాధించిన హ్యాట్రిక్ విజయం సామర్లకోట పట్టణానికే తలమానీకం అని పలువురు వక్తలు అన్నారు. సామర్లకోట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి కాకినాడ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులుగా మూడోసారి ఘన విజయం సాధించిన సామర్లకోట కు చెందిన ప్రముఖ న్యాయవాది, పూర్వపు పాత్రికేయులు అయిన కొర్లమండ వీరభద్రరావు, శ్రీవాణి దంపతులకు ఆత్మీయ అభినందన కార్యక్రమం లయన్స్ అధ్యక్షులు కానుబోయిన విజయ కృష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమం లో లయన్స్ జిల్లా ప్రెసిడెంట్ చిత్తులూరి వీర్రాజు (రాజా), సినీ దర్శకులు, రచయిత నటులు కె బి ఆనంద్ తదితరులు మాట్లాడుతూ ప్రజా సేవలో ఎల్లవేళలా ముందుండి అవసరాల్లో ఉన్న వారికి చేదోడుగా ఉంటున్న న్యాయవాదులు కొర్లమండ దంపతులకు సేవలను అభినందించారు. వరుసగా మూడుసార్లు బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులుగా గెలుపొంది హ్యాట్రిక్ సాధించడం సామర్లకోట పట్టణానికి ఎంతో గర్వకారణం అన్నారు. రానున్న రోజుల్లో అసోసియేషన్ అధ్యక్ష పదవిని అధిరోహించాలని వారు ఆకాంక్సించారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు వీరభద్ర రావు శ్రీవాణి దంపతులను పూలమాలలు, దుస్సాలువాలతో ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమం లో లయన్స్ కార్యదర్శి బడుగు సీతా రామరాజు, నాయకులు మేకా శ్రీనివాస్, సేపేని సురేష్, కర్రి ఆదినారాయణ రెడ్డి, గుండు శంకర రావు, ప్రత్తి రామ లక్షమణమూర్తి, అందుగుల జార్జి చక్రవర్తి, కాపుగంటి పైడిరత్నం, కటకం గంగబాబు, సకలకళా సమాఖ్య నాయకులు కేతినీడి శ్రీనివాస్, కర్రి బాబురావు, సీపీఐ సీనియర్ నాయకులు ఎలిశెట్టి రామదాస్, సామర్లకోట – పెద్దాపురం ఆర్కెస్ట్రా ఆర్థిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు గిడుతూరి శ్రీనివాస్, కొండల రావు, తదితరులు పాల్గొని కొర్లమండ దంపతులకు సేవలను కొనియాడారు. సన్మానగ్రహీత భద్రరావు మాట్లాడుతూ తల్లిదండ్రుల ఆశీస్సులు, జీవిత భాగస్వామి, కుటుంబం సహకారంతో తాను ఇప్పటి వరకూ ఎన్నో విజయాలు, సేవా కార్యక్రమాలు చేపట్టినట్టు చెప్పారు. రానున్న రోజుల్లో ఇటు బార్ అసోసియేషన్ కు, అటు సామర్లకోట లోని ప్రజలకు తనవంతు సేవలను అన్నివేళలా అందుబాటులో ఉండి అందించ నున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.

➡️