మజ్జిగ చలివేంద్రం ప్రారంభం

May 7,2024 22:32
కాకినాడ జయంద్ర నగర్లోని

ప్రజాశక్తి – కాకినాడ

కాకినాడ జయంద్ర నగర్లోని డీమర్ట్‌ ఎదురుగా ఆసరా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ చలివేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు. రోజురోజుకి వేసవి తాపం పెరిగిపోతుండటంతో అధిక ఎండలు దృష్టిలో ఉంచుకుని ఈ మజ్జిగ చలి వేంద్రంను ఏర్పాటు చేసినట్లు ఆసరా ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ దాసరి కేదారి తెలిపారు. నెల రోజులపాటు ప్రజలకు ఉచితంగా చల్లని మజ్జిగను పంపిణి చేయడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో వనిత, రాజీ, వెంకటి, సంస్థ సభ్యులు పాల్గొన్నారు.

➡️