‘సిద్ధం’ సభకు వెళ్తున్న తాళ్లరేవు శ్రేణులు 

Feb 3,2024 14:17 #Kakinada
tallarevu goto siddham meeting

ప్రజాశక్తి – తాళ్లరేవు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని దెందులూరు వద్ద వైకాపా అధ్యక్షులు వై. యస్. జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఎన్నికల శంఖారావంలో భాగంగా జరగనున్న సిద్ధం, మహా గర్జనకు తాళ్లరేవు నుంచి పెద్ద ఎత్తున వైకాపాశ్రేణులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా తాళ్లరేవు చెరువు సెంటర్ వద్ద ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. కార్యక్రమంలోఏ. ఎమ్. సి. చైర్మన్ కుడుపూడి శివ న్నారాయణ, మండల వైకాపా ప్రధాన కార్యదర్శి రాయుడు గంగాధర్, తాళ్లరేవు వైకాపా నాయకులు శ్రీనివాస రెడ్డి, కొల్లు శ్రీనివాసరావు, చిట్టూరి చలపతి, నంది కోళ్ల శ్రీమన్నారాయణ, పొన్నాడ భైరవమూర్తి బొంతు మోహన్, కుడిపూడి మల్లేష్, పిల్లి పరదేశ్వర రావు, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

➡️